ETV Bharat / state

నిషేధంపై యూటర్న్ - ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్ - Ganesh Immersion 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 3:48 PM IST

Ganesh Immersion 2024 in Hussainsagar : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయకుల నిమజ్జనానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిషేధం నిర్ణయంపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి చేపట్టిన ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. ట్యాంక్​బండ్​పై నిమజ్జనాలను నిషేధిస్తూ ఏర్పాటు చేసిన భారీ గేట్లు, ఫ్లెక్సీలను తొలగించారు. గణపయ్యను నిమజ్జనం చేయడానికి క్రేన్​లను ఏర్పాటు చేస్తున్నారు.

Ganesh Immersion 2024
Ganesh Immersion at Tankbund (ETV Bharat)

Ganesh Immersion at Tank Bund : ట్యాంక్‌బండ్‌పై వినాయకుల నిమజ్జనాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై అధికారులు యూటర్న్ తీసుకున్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆందోళనతో అధికారులు దిగి వచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో వినాయకుల నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేసిన భారీ గేట్లు, నిమజ్జనం చేయకూడదని సూచిస్తూ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. హుస్సేన్‌సాగర్‌లో గణపతులను నిమజ్జనం చేయడానికి క్రేన్​లను రంగంలోకి దింపుతున్నారు.

ఉత్సవ సమితి ఆందోళన : అంతకుముందు హుస్సేన్‌సాగర్‌లో వినాయకుల నిమజ్జనాన్ని నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతికి హాని కలిగించే విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని కోర్టు సైతం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిమజ్జనం సాఫీగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం, ట్యాంక్​బండ్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి నిషేధించడం సరికాదని మండిపడ్డారు.

Ganesh Nimajjanam At Hussain Sagar : ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌పై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, భక్తులతో ఉత్సవ సమితి సభ్యులు గణేశ్‌ నిమజ్జనం చేయించారు. ఈ రోజు సాయంత్రం వరకు నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చెయ్యకపోతే సోమవారం నగర వ్యాప్తంగా నిరసన చేపడుతామని వారు హెచ్చరించారు. ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన భక్తులతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయించారు.

వ్యర్థాల తొలగింపుకై రంగంలోకి కార్మికులు : మరోవైపు హుస్సేన్​సాగర్​లో, నెక్లెస్​రోడ్​లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్​కు తరలిస్తున్నారు. ఈ విధంగా సాగర్​లో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే నిమజ్జనం అనంతరం వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ, రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీహెచ్‌ఎంసీ తీసుకుని పనులు మొదలుపెట్టాయి.

వెల్లివిరిసిన మత సామరస్యం : గణేశుడి సేవలో ముస్లిం సోదరుడు - 216 కిలోల లడ్డూ సమర్పణ - Muslim Gave 216kg Laddu to Ganesh

ఖైరతాబాద్ గణేశ్‌పై డీజీపీ కీలక అప్డేడ్ - నిమజ్జనం ఎన్ని గంటలకంటే! - Ganesh Immersion 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.