ETV Bharat / state

హైడ్రా దూకుడు- అమీన్​పూర్​లో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolitions in Sangareddy

Hydra Demolitions in Sangareddy : అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన అధికారులు పటాన్‌చెరులోని అమీన్‌పూర్‌ సహా వివిధచోట్ల నిర్మాణాలను తొలగించారు. హైడ్రా ఆదేశాల మేరకు అక్రమార్కుల చెర నుంచి విలువైన భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Demolitions in Sangareddy
Hydra Demolitions in Ameenpur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 9:50 AM IST

Hydra Demolitions in Ameenpur : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఐలాపూర్‌ తాండా సర్వేనంబర్‌ 119లో దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకొని వెంచర్లు వేశారు. అక్రమాలపై హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు.

హైడ్రా దూకుడు- అమీన్​పూర్​లో అక్రమ కట్టడాల కూల్చివేత (ETV Bharat)

మరిన్ని కూల్చివేతలు : పోలీసులు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. అక్రమిత భూముల్లో ప్లాట్లుకొని మోసపోవద్దని ప్రజలకు రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు హైడ్రా అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశామని తహశీల్దార్‌ రాధ స్పష్టం చేశారు. త్వరలో సర్వే చేసి మరిన్ని అక్రమ కట్టడాలను గుర్తించి నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.

మున్సిపల్‌ చైర్మన్‌ అక్రమ కట్టడాలు : అమీన్‌పూర్‌లో ఓప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ, ఆటస్థలాన్ని నేలమట్టం చేశారు. ప్రొక్లెయిన్ సహాయంతో ప్రహరీని కూల్చి దాదాపు 15 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్‌ 462లో 38 గుంటల ప్రభుత్వ భూమిలో వెలసిన దుకాణాలను తొలగించారు. ఆ దుకాణాలు స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డివిగా గుర్తించిన అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు.

అధికారులతో ఛైర్మన్‌ పాండురంగారెడ్డి, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేసినా నేలమట్టం చేస్తామని అధికార యంత్రాగం స్పష్టంచేస్తోంది. హైడ్రా పేరుతో ఇన్ని అక్రమ కట్టడాలు స్థానిక రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ అధికారులు కూల్చివేసినా హైడ్రా అధికారులు మాత్రం దీనిపై మాకు సంబంధం లేదని పేర్కొన్నారు. స్థానిక అధికారులే కూల్చేశారని, వాళ్లు కూల్చకపోతే మేము కూలుస్తామని రంగనాథ్‌ చెప్పడం గమనార్హం.

"సంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వభూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశాము. అక్రమ కట్టడాలపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. మాకు వారి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక్కడి 20 ఎకరాల ప్రభుత్వభూమిలో వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అక్రమిత భూముల్లో ప్లాట్లుకొని మోసపోవద్దు. త్వరలో మరింతగా సర్వే చేసి మరిన్ని ప్రభుత్వభూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేస్తాము". - రాధ, ఎమ్మార్వో సంగారెడ్డి

ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం : రంగనాథ్ - Ranganath about Hydra Operations

జన్వాడ ఫాంహౌస్​ను ఏ అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు! - Hydra Focus on Janwada Farm House

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.