Nutritious Meal At School After Sankranti : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ మెనూను ప్రభుత్వం జోన్లవారీగా మార్పు చేసింది. ఈ మెనూ ప్రాంతాల వారీగా విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఆసక్తిగా తినే ఆహారం ఆధారంగా రూపొందించారు. దీంతో పాటు విద్యార్థులకు పోషకాలు అందేలా రూపొందించారు. సంక్రాంతి సెలవుల తర్వాత బడుల్లో దీనిని అమల్లోకి తీసుకువస్తారని అధికారులు తెలుపుతున్నారు. వారంలో మంగళవారం మాత్రం రెండు రకాల మెనూలు ఇచ్చారు.
విద్యార్థుల ఆసక్తి మేరకు ఏదో ఒక దాన్ని చేస్తారు. జోన్-1లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉండగా జోన్-2లో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్-3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఉన్నాయి. జోన్-4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
వారం | జోన్-1 | జోన్-2 |
---|---|---|
సోమవారం | అన్నం, ఆకుకూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ | అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ |
మంగళవారం | అన్నం, గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ | పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజావ |
బుధవారం | వెజ్పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ | అన్నం, కూరగాయల కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ |
గురువారం | అన్నం, సాంబారు, గుడ్డుకూర, రాగిజావ | వెజ్రైస్/పులావ్, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ |
శుక్రవారం | పులిహోర, చట్నీ (గోంగూర, కూరగాయలు), ఉడికించిన గుడ్డు, చిక్కీ | అన్నం, ఆకుకూరలతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ |
శనివారం | తెల్ల అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్ పొంగల్ | అన్నం, కూరగాయల కూర,స్వీట్ పొంగల్, రాగి జావ |
విద్యార్థులకు వరం - జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
వారం | జోన్-3 | జోన్-4 |
---|---|---|
సోమవారం | అన్నం, సాంబారు, గుడ్డుఫ్రై, చిక్కీ | అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ |
మంగళవారం | పులిహోర, టమాటా/ పుదీనా చట్నీ, గుడ్డు ఫ్రై, రాగి జావ | పులగం/పులిహోర, పల్లీ చట్నీ, కోడిగుడ్డు ఫ్రై, రాగిజావ |
బుధవారం | అన్నం, 4 కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ | అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు, చిక్కీ |
గురువారం | వెజిటెబుల్ రైస్/ పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ | వెజిటెబుల్ రైస్, గుడ్డుకూర, రాగిజావ |
శుక్రవారం | అన్నం, గుడ్డు కూర, చిక్కీ | అన్నం, ఆకు కూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ |
శనివారం | అన్నం, టమాటా పప్పు/ పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ | అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ |
మధ్యాహ్న భోజనంలో రాళ్లు, పురుగులు, వెంట్రుకలు - తల్లిదండ్రుల ఆగ్రహం