ETV Bharat / state

ఆనందం, ఆరోగ్యంగా ఉండాలనే రూ. 228 కోట్ల విరాళం: కృష్ణ చివుకుల - 228 crore donation to IIT Madras

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 9:44 AM IST

NRI Krishna Chivukula 228 Crore Donation to IIT Madras: బాపట్లలో సన్నకారు రైతు కుటుంబం నుంచి అంతర్జాతీయంగా కార్పొరేట్​ సంస్థలు నెలకొల్పిన ఇండో మిమ్‌ సంస్థ ఛైర్మన్‌ కృష్ణ చివుకుల ఎంత ఎదిగినా జన్మభూమిని మరవలేదు. తాను ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాళాన్ని అందిచడానికి అమెరికా నుంచి క్యాంపస్‌కి వచ్చి అందించారు. దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తం వచ్చిన దాఖలా లేదు. తిరుపతిలో గతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేశామని వాటిని మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు.

NRI Dr Krishna Chivukula 228 Crore Donation to IIT Madras
NRI Dr Krishna Chivukula 228 Crore Donation to IIT Madras (ETV Bharat)

NRI Dr Krishna Chivukula 228 Crore Donation to IIT Madras : అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్‌ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం, ఇండో మిమ్‌ సంస్థ ఛైర్మన్‌ కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన.

తాను ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ విరాళాన్ని అందిచడానికి అమెరికా నుంచి క్యాంపస్‌కి వచ్చారు. అనంతరం క్యాంపస్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో పాల్గొని రూ.228 కోట్ల భారీ విరాళాన్ని అందిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆనందంగా ఉండాలని చేశాను : ఐఐటీ మద్రాస్‌కు ఇటీవల ప్రకటించిన భారీ విరాళాన్ని అందించడానికి అమెరికా నుంచి ఐఐటీ మద్రాస్‌ వచ్చానని, రూ.228 కోట్ల విరాళం అందించానని కృష్ణ చివుకుల తెలిపారు. దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తం వచ్చిన దాఖలా లేదని అన్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నానని కొందరు అడుగుతున్నారని, తాను ఆనందంగా ఉండాలని, తద్వారా తన ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంతకుమించి తానేమీ ఆశించడం లేదని కృష్ణా చివుకుల అన్నారు.

25 ఏళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండదు : అమెరికాలో 55 ఏళ్లుగా ఉంటున్నానని, అక్కడి యూనివర్సిటీలకు ధనికులు విరివిగా విరాళాలు ఇస్తుంటారని తెలిపారు. సమాజంలో విద్య, ఆరోగ్యం పెంచేందుకు, పేదరికం నిర్మూలించేందుకు ఆర్థికంగా అండగా నిలబడతారని అన్నారు. తన దేశానికి సేవ చేయాలని ఎన్నో ఏళ్లుగా మనసులో బలంగా అనిపిస్తోందని తెలిపారు. అమెరికా వాళ్లు సైతం ఐఐటీ మద్రాస్‌ నుంచి వచ్చే ఇంజినీర్లను చూసి ఆశ్చర్యపోతుండటం చూశానని గుర్తు చేశారు.

అలాంటి చోట తాను చదువుకున్నానని, అందుకే తన దాతృత్వ కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని అనుకున్నానని తెలిపారు. ఈ నిధులతో ఐఐటీ మద్రాస్‌లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయని, క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుందని పేర్కొన్నారు. క్యాంపస్‌ నుంచి విడుదలవుతున్న మ్యాగజైన్‌లకు నిధుల లభ్యత ఏర్పడుతుందని, 5 కేటగిరీల్లో క్యాంపస్‌కు 25 ఏళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండదని వెల్లడించారు. కృష్ణా చివుకుల సేవలకు గుర్తుగా ఐఐటీ మద్రాస్‌లోని ఓ అకడమిక్‌ బ్లాక్‌కు అధికారులు ఆయన పేరు పెట్టారు.

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు : ఏపీలోని తిరుపతిలో గతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేశామని వాటిని మరింతగా విస్తరిస్తామని తెలిపారు.

దాతృత్వంలో మేటి : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్‌ అవార్డు అందజేశాయి.

బాపట్ల నుంచి ప్రస్థానం : ఏపీలోని బాపట్లకు చెందిన డాక్టర్‌ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్‌ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్‌ కేంద్రంగా 'శివ టెక్నాలజీస్​'ను నెలకొల్పారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (MIM) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.

మాతృభూమిని మరవని బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల - ఐఐటీ మద్రాసుకు​ భారీ విరాళం - NRI Huge Donation to IIT Madras

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.