ETV Bharat / state

మద్యం, బిర్యానీ ఇచ్చి జనం తరలింపు - అయినా సీఎం జగన్​ ప్రసంగిస్తుండగానే సభ ఖాళీ - NO Public in Jagan Meeting

NO Public in CM Jagan Bus Yatra Meeting: సీఎం జగన్​ సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతలు ప్రజలకు మద్యం, బిర్యానీ, రూ. 500 అంటూ ప్రలోభాల గాలం వేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సైతం ఏర్పాటు చేశారు. సభకు రాకుంటే పథకాలు నిలిపివేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. సీఎం జగన్​ ప్రసంగించే వేళ సభా ప్రాంగణం నుంచి ప్రజలు వెళ్లిపోయారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 12:00 PM IST

NO Public in CM Jagan Bus Yatra Meeting: సిద్ధం సభకు ఎలాగైనా జన సమీకరణ చేయాలని కొందరు వైసీపీ నేతలు ప్రజలకు ప్రలోభాల గాలం వేసి తరలించారు. భీమవరంలో జరిగే బహిరంగ సభకు వస్తే రూ.500, మద్యం, రెండు పూటలా బిర్యానీ ఇస్తామంటూ సమీకరణ చేశారు. ఊరూరా జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎంతమందిని రప్పించాలో నాయకులు టార్గెట్లు పెట్టుకుంటున్నారు. రావులపాలెం, కొవ్వూరు, కాకినాడ, ఏలేశ్వరం, తణుకు డిపోల నుంచి బస్సులు ఉదయమే ఆయా గ్రామాలకు చేరుకోగా మధ్యాహ్నం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరాయి.

భీమవరంలో సీఎం బస్సు యాత్ర - రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు - CM Jagan Tour Trees Cuts

సీఎం సభ నుంచి వెళ్లిపోయిన జనం: పెనుగొండ మండలంలో బస్సుకు రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది. అయితే రెండు రోజుల ముందు నుంచే వైసీపీ శ్రేణులు, గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రైవేట్‌ సైన్యమైన గృహ సారథులు, కన్వీనర్లు ఎవరెవరు సభకు వస్తున్నారంటూ కసరత్తు చేశారు. బస్సు ఎక్కగానే నగదు, మద్యం, రెండు పూటలా బిర్యానీలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. పింఛను, రేషన్‌కార్డు, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తప్పనిసరిగా రావాలంటూ హుకుం జారీ చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమని జనాలకు మభ్య పెట్టి సభకు తరలించారు. సభకు రాకుంటే పథకాలు నిలిపివేస్తామంటూ రాజీనామా చేసిన వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడటంతోపాటు నగదు, మద్యం, బిర్యానీ అని గాలం వేసి జనాన్ని తరలించారు.

జగన్ బస్సు యాత్రతో జనానికి చుక్కలు - ఆస్పత్రిలో రోగుల అవస్థలు, దుకాణదారుల గగ్గోలు - CM YS Jagan Election Campaign

వైసీపీ నేతలు ఇంత చేసినా తీరా సీఎం జగన్​ ప్రసంగించే వేళ సభా ప్రాంగణం అంతా జనం లేక బోసిపోయింది. భీమవరంలో సీఎం సభ కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను నుంచి భారీగా తరలించారు. మూడో వంతు జనం బస్సుల్లోంచి దిగకపోగా, బస్సు దిగిన వారు సభా ప్రాంగణంలో నిలబడలేకపోయారు. బస్సుయాత్ర సభా వేదిక వద్దకు చేరుతుండగానే జనాలు పెద్ద సంఖ్యలో వెళ్లిపోతూ కనిపించారు. జగన్‌ ప్రసంగించేటప్పుడు కొన్ని గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. అక్కడే మందుబాబులు మద్యం తాగుతూ కనిపించారు. దీంతో వైసీపీ నేతలకు మళ్లీ నిరాశే ఎదురైంది.

మధ్యాహ్నం జగనన్న రాక - ఉదయమే నుంచే పవర్​ కట్​ - CM Jagan bus yatra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.