ETV Bharat / state

25 వెంచర్లకే అధికారిక అనుమతులు- వెలిసింది వెయ్యికి పైగా లేఅవుట్లు! - ILLegal Layouts in Kadapa - ILLEGAL LAYOUTS IN KADAPA

NO Permission Layouts in Kadapa: గత ప్రభుత్వ అండతో కడపలో కొందరు వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా భారీ వెంచర్లు వేశారు. డెవలప్​మెంట్​ అథారిటీ పరిధిలో అనుమతి తీసుకున్న లే అవుట్లు 25 కాగా అనధికారికంగా వెలిసినవి 1000కి పైగా ఉన్నాయి. కడపలోని అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. దీంతో వారు 3 రోజులపాటు అనధికార లే అవుట్లను పరిశీలించనున్నారు.

NO Permission Layouts in Kadapa
NO Permission Layouts in Kadapa (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 5:20 PM IST

NO Permission Layouts in Kadapa : కడప అర్బన్‌ డెవలప్‌మెంట్​ అథారిటీ 862 గ్రామాలు, 51 మండలాలు, 10 పట్టణ స్థానిక సంస్ధలతో మొత్తం 13,062 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే 2019 నుంచి 2024 మధ్య ఈ విస్తీర్ణంలో అథారిటీ ద్వారా అనుమతి తీసుకున్న లే అవుట్లు 25 కాగా అనధికారికంగా వెలిసినవి 1,000కి పైగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికార యంత్రాంగం వైఎస్సార్సీపీ నేతలకు సంపూర్ణంగా సహకరించడంతోనే అక్రమాలు యథేచ్ఛగా సాగాయి.

పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు - Peddireddy Land Grabs

కడప అర్బన్‌ డెవలప్‌మెంటు అథారిటీ వైఎస్సార్సీపీ డెవలప్‌మెంటు అథారిటీగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కడపలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. దీంతో వారు 3 రోజులపాటు వివిధ ప్రాంతాల్లోని అనధికార లే అవుట్లను బృందం పరిశీలిస్తుంది.

కడప నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక నగర్‌ కూడలి సమీపంలో మినిస్టర్స్‌ కాలనీ పేరుతో ఓ వైఎస్సార్సీపీ కీలక నేత భారీ లేఅవుట్‌ వేయగా విల్లాల నిర్మాణం కూడా చేపట్టారు. మాచుపల్లి రోడ్డులో ఆయన సమీప బంధువులు భారీ స్థాయిలో వేసిన అక్రమ లేఅవుట్ల ప్రారంభోత్సవానికి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిధులుగా హాజరవ్వడం గమనార్హం. సాయిపేట శివార్లలోనూ భారీ వెంచర్‌ ఏర్పాటు చేశారు. కడప నగరంలోని ఇర్కాన్‌ కూడలి నుంచి రింగురోడ్డు మీదుగా రాయచోటి కూడలి వరకు దాదాపు 20 అక్రమ లేఅవుట్లు వెలిశాయి.

వైఎస్సార్సీపీ పెద్దల భూకబ్జా - ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు - Irregularities in Swapnalok Layout

ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ మార్గంలో దాదాపు 50 ఎకరాల్లో భారీ వెంచర్‌ చేశారు. కడపలోని వివిధ పరిసరాల్లోనూ అక్రమ లేఅవుట్లున్నాయి. చెన్నూరు వద్ద జాతీయ రహదారి పక్కన ఒకటి, బద్వేలులోని నెల్లూరు రోడ్డు, చాంద్‌ థియేటర్‌ సమీపంలో, పులివెందులలో పార్నపల్లి రోడ్డులోని భారీ వెంచర్లు వేశారు. రాజంపేటలో కూచివారిపల్లి, పోలి తదితర ప్రాంతాల్లో, రాయచోటి బాహ్యవలయ రహదారి వెంట, వల్లూరు మండల పరిధి నుంచి కడప విమానాశ్రయం వరకు లెక్కలేనన్ని అక్రమ లేఅవుట్లు వెలిశాయి.

ప్రొద్దుటూరులో దాదాపు 200 అక్రమ వెంచర్లు వేసినట్టు అంచనా. వీటిని వేసిన వైఎస్సార్సీపీ నేతలు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వీరికి సహకరించిన అధికారులు కావాల్సినంత సంపాదించుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని కొన్న సామాన్యులే మోసపోతున్నారు. ప్రత్యేక బృందాలు అక్రమాలను బయటకు తీసి, సంబంధితులపై చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

జగన్​ సొంత నియోజకవర్గంలో భారీగా అక్రమాలు- అనర్హులకు హౌసింగ్​ లేఅవుట్ కేటాయింపు - corruption jagananna housing

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.