ETV Bharat / state

డీఎస్సీ పరీక్షలు యథాతథం - ఈ నెల 11న హాల్‌టికెట్లు విడుదల : విద్యాశాఖ - TG DSC As Per Schedule - TG DSC AS PER SCHEDULE

TG DSC Recruitment 2024 : రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల తేదీల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈమేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు సైతం అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.

Telangana DSC Schedule Issue 2024
No Changes DSC Exams dates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 7:29 PM IST

Updated : Jul 8, 2024, 10:04 PM IST

No Changes in Telangana DSC Exam Dates : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి పాఠశాల విద్య అధికారిక వెబ్​సైట్​లో హాల్​టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

డీఎస్సీని కంప్యూటర్ టెస్డ్​గా నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుమారు 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ, ఈ నెల 18 నుంచి కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహించనుంది.

DSC Candidates Protest In Hyderabad : మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్‌లో ఇవాళ ఆందోళనకు దిగారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేశ్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్​ ముందు అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. డీఎడ్, బీఎడ్, నిరుద్యోగులు గత కొన్ని ఏళ్లుగా డీఎస్సీ కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.

ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి, డీఏఓ, టెట్‌ పరీక్షలను రాయడం జరిగిందని, ఇప్పుడు వెంటనే డీఎస్సీ పరీక్ష ఉంటే దానికి సన్నద్ధం అవ్వడానికి సరైన సమయం లేదని వివరించారు. అంతేగాక డీఎస్సీలో న్యూ సిలబస్ మార్పులు చేశారని దాన్ని పూర్తిగా చదవడానికి సమయం పడుతుందని అన్నారు.

ఈ కొంత టైమ్​లో పరీక్షలకు సన్నద్ధం అవ్వలేకపోతున్నట్లు వాపోయారు. కాగా పరీక్షల పూర్తి ప్రిపరేషన్​ కోసం మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నియామకాలు పూర్తి అయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ముట్టడికి యత్నించిన పలువురు అభ్యర్థులను అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదని ప్రకటన వెలువడటం గమనార్హం.

డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ధర్నా - విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం - DSC Candidates Protest in Hyderabad

తెలంగాణ డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ విడుదల.. పూర్తి వివరాలివే? - TELANGANA DSC Exam 2024 Schedule

Last Updated : Jul 8, 2024, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.