Niloufer Hospital Fire Accident in Hyderabad : హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న నిలోఫర్ ఆసుపత్రి(Niloufer Hospital)లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మొదటి అంతస్తు ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాంగణం మొత్తం పొగతో నిండిపోయింది. ఆసుపత్రిలో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే నిలోఫర్‌కు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి చేరుకుని, ప్రమాదంపై ఆరా తీశారు. రబ్బరుతో కూడిన పరికరాలు ఉండడంతో దట్టమైన పొగలు వచ్చాయని ఆమె వివరణ ఇచ్చారు. సకాలంగా అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, వారు ఇక్కడకు వేగంగా రావడంతోమంటలు సకాలంలో అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు.
గుడిమల్కాపూర్ అంకుర ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం - పేషెంట్లు సురక్షితం
Fire Accident at Shopping Mall in Habsiguda : హబ్సిగూడలో అగ్నిప్రమాదం.. మంటలు ఆపేందుకు 4 గంటలు