Bride Protest at Groom House in Mancherial District : బంధుమిత్రుల సమక్షంలో ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు వైభవంగా వివాహం చేశారు. తమ బాధ్యత తీరిందని ఆనంద బాష్పాలతో అత్తింటికి సాగనంపారు. అత్తవారింటికి గౌరవం తెచ్చేలా నడుచుకోవాలని చెప్పారు. ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోవాలని ఆమెకు వివరించారు. కానీ తిరిగి ఆ అమ్మాయి నాలుగు రోజులకే పుట్టింటికి చేరుకుంది.
దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు కారణం ఏంటనీ వారు ఆలోచించసాగారు. ఎక్కడైనా దంపతుల మధ్య గొడవ వచ్చిందేమోనని ఆరా తీశారు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. మీ కుమార్తె ఇంట్లో అన్నం తినడం లేదని, జ్యూస్‌లే తాగుతుందని వరుడు చెప్పడంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఇలా చిన్న కారణాలతో అల్లుడు తమ కూతురిని పుట్టింట్లో వదిలేస్తున్నాడని ఆ వధువు తల్లిదండ్రులు అబ్బాయి పేరెంట్స్‌కు చెప్పడానికి ఫోన్ చేయగా వారు సరిగ్గా స్పందించలేదు. దీంతో ఆ నవ వధువు, బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు ఆదివారం నాడు ఆందోళన చేపట్టింది. చావైనా బతుకైనా అతనితోనే అంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
13న పెళ్లి.. 15న మృతి.. బావిలో శవంగా తేలిన నవ వధువు.. పరారీలో భర్త
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్‌కు, మంచిర్యాలకు చెందిన ఓ యువతి(22)తో గత నెల 24న వివాహమైంది. పెళ్లైన నాలుగో రోజే భర్త ప్రవీణ్ వధువును ఆమె తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆమె ఇంట్లో అన్నం తినడం లేదని, జ్యూస్‌లే తాగుతుందని అతను చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
దీనిపై వరుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, తమకేమి సంబంధం లేదన్నట్లు సమాధానం ఇచ్చినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు సెల్‌ఫోన్‌లో సంప్రదించగా నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకుందామని వరుడి తల్లిదండ్రులు చెబుతూ మాట దాటవేస్తూన్నారని వారు ఆరోపించారు. తమ కుమారుడికి అమ్మాయితో కాపురం చేయడం ఇష్టం లేదంటూ, ఇంటికి వస్తే తాళం వేసుకొని బయటకు వెళ్తున్నారని యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తాళ్లగురిజాల ఎస్సై నరేష్‌ను వివరణ కోరగా సోమవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు రావాలని చెప్పామని వివరించారు.
New Bride Suicide in Hyderabad : పెళ్లైన 14 రోజులకే నవవధువు ఆత్మహత్య.. కారణమదేనా..!
'నాకింకా చదువుకోవాలనుందమ్మా కానీ ఇప్పుడు కుదరదు - అందుకే చనిపోతున్నా' - BRIDE SUICIDE IN KOTHAGUDEM