New Software For Testing Blood Without Sample : ఈ మధ్యకాలంలో యాంటి బయోటిక్ మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వాటిని వాడేస్తున్నారు. అవి అవసరమా లేదా అని ఆలోచించడం లేదు. అలా వాటిని వాడకాన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇస్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్‌లోని సైవన్ వి స్టార్టప్ కంపెనీతో కలిసి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశాయి.
కృత్రిమ మేధ సహాయంతో చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు ఏఎంఆర్‌ఎక్స్ అని పేరు పెట్టారు. ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణులు తన ఎదుట ఉన్న రోగికి వచ్చిన జబ్బు, వ్యాధి గురించి ఎలా విశ్లేషిస్తారో అలాగే వివరిస్తుంది. వైద్యుల మనసు, మెదడు ఎలా ఆలోచిస్తాయో అలాగే చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఫలితాలు తక్షణమే వస్తాయి. దీంతో యాంటీ బయోటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించొచ్చు. ఇప్పటిదాకా చాలామందితి వైద్యులు రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటి బయోటిక్స్ ఇస్తూ రిపోర్ట్ వచ్చకా అసలు యాంటి బయోటిక్ మందులు అవసరమా, తగ్గించాల అని నిర్ణయిస్తున్నారు.
పాముకాటుకు విరుగుడు- ల్యాబ్‌లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!
దీన్ని ఎలా వాడుతారు అంటే : చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెబుతున్నప్పుడు వైద్యులు వాటిని రాసుకుని ఆ సమాచారమంతా సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఒక్క రక్తం కూడా అవసరం లేకుండా క్షణాల్లో అది ఫలితాలను వెల్లడిస్తుంది. ఏఎంఆర్‌ఎక్స్ సాఫ్ట్‌వేర్‌పై నాలుగేళ్ల క్రితమే పరిశోధనలు మొదలయ్యాయి. ప్రయోగాత్మకంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పదివేల మంది పేషెంట్స్ పరిస్థితులను పరిశీలించారు.
ఒకవైపు వారి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. మరోవైపు ఆ రోగులు చెప్పిన అనారోగ్య లక్షణాలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా సోకుతున్న జబ్బులు, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు మొదలైన వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేశారు. ఆ ఫలితాలను సంప్రదాయ పద్ధతిలో రోగి నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల పరీక్షల ఫలితాలను వైద్య నిపుణులు విశ్లేషించగా రెండూ ఓకేలా ఉన్నాయి. పరిశోధనల ఫలితాలను గతేడాది ఎథిక్స్ కమిటీకి పంపించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించవచ్చంటూ ఆరునెలల క్రితం ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. దీంతో పేటెంట్ రైట్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
"చిన్న జబ్బులతో బాధ పడుతున్నవారు, ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారికి వైద్యులు యాంటీబయాటిక్ మందులు ఇస్తున్నారు. మందులు ఇచ్చేముందు రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఏఎంఆర్‌ఎక్స్ సాఫ్ట్వేర్ రోగి లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేస్తుంది." - డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, హైదరాబాద్
వంట నూనె ఇంధనంగా - నింగిలోకి దూసుకెళ్లిన 'వర్జిన్ అట్లాంటిక్' ఫ్లైట్!
18వారాలకు కవల పిండం మృతి- 125 రోజులకే మరో శిశువుకు జన్మ- వైద్య రంగంలోనే అద్భుతం