ETV Bharat / state

కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? - ఐతే మీకో గుడ్ న్యూస్

తీరనున్న రేషన్ కార్డు సమస్యలు - త్వరలో నమోదు ప్రక్రియ - డిజిటల్‌ కార్డులు కొలిక్కి రాగానే కీలక నిర్ణయం

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 47 seconds ago

NEW FAMILY MEMBERS IN RATION CARD
Telangana Govt on New Family Members in Ration Card (ETV Bharat)

Telangana Govt on New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? ఐతో మీకో శుభవార్త. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫారల శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నూతన రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు.

ఒక కుటుంబానికి రేషన్​కార్డు ఉంది. కానీ రేషన్‌ మాత్రం భార్యాభర్తలకే వస్తోంది. వారి ఇద్దరు పిల్లలకు మాత్రం రావడంలేదు. మరో కుటుంబంలోని రేషన్‌కార్డులో కోడలి పేరు చేరలేదు. అలాగని పుట్టినింట కార్డులోనూ ఆమె పేరు లేదు. పెళ్లయి అత్తారింటికి వెళ్లాక ఆమె పేరును పుట్టింటి కార్డులో నుంచి తొలగించారు. ఏళ్లుగా ఉన్న ఇలాంటి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం. అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను రేషన్‌కార్డుల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిసింది.

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఈ విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను ఉన్న రేషన్​కార్డుల్లో చేర్చే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత కొత్త రేషన్​కార్డుల దరఖాస్తుల స్వీకరణ సైతం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్​కార్డులోని అర్హుల పేర్లను చేర్చాలని మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఇన్నాళ్ల వరకు పౌరసరఫరాల శాఖ వాటిని పరిశీలించలేదు.

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుతో రేషన్ అర్హత వివరాలు : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న విషయంపై అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. నెలకు సుమారు 9,890 టన్నుల బియ్యం అదనంగా కావాల్సి ఉంటుందని, దాదాపు రూ.37.40 కోట్ల భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. మొదట ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు వచ్చాక ప్రస్తుత రేషన్‌ కార్డులు, అందులోని సమాచారం అంతా చేరిపోయేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నట్లు ఓ ఉన్నతాధికారు ఒకరు చెప్పారు.

రేషన్‌ దుకాణంలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుతో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆ కుటుంబానికి ఏ సరకులకు, ఎంత పరిమాణానికి అర్హత ఉందన్న వివరాలు తెలుస్తాయి. దాని ప్రకారం రేషన్​ ఇస్తారు. తర్వాత అర్హులైన కుటుంబ సభ్యలను చేర్చే దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తే, ఆ మేరకు ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల్లో కూడా వారి వివరాలు చేరిపోతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

సాంకేతిక సమస్యలతో ప"రేషన్"- కేవైసీ అప్డేట్‌కు గడువు పెంచిన ప్రభుత్వం - Ration Card KYC Update

రాష్ట్రంలో వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డులు - త్వరలోనే పైలెట్ ప్రాజెక్ట్​ ప్రారంభం - CM REVANTH REVIEW MEET

Last Updated : 47 seconds ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.