New Machine Invented Singareni Engineer to Coal : రాష్ట్రమంతటికీ విద్యుత్ వెలుగులను పంచడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుంది. భూమి పొరల అడుగు నుంచి బొగ్గును తీసేందుకు కార్మికులు నిత్యం చెమటోడ్చుతారు. ఐతే, ఓ ఇంజినీర్ ఆలోచనతో ఫిట్టర్ హెల్పర్ చేసిన పనిముట్టు కార్మికుల పనిభారాన్ని తగ్గించింది. సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు లేని విధంగా మంచిర్యాల జిల్లా కాసిపేట-2 ఇంక్లైన్‌లో టబ్ క్లీనింగ్ యంత్రం ఆవిష్కరించారు. ఈ యంత్రంతో కార్మికుల పనిభారం తగ్గడంతో పాటు ఉత్పత్తి పెరిగిందని యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది.
త్వరలో కొత్త బొగ్గు గనుల వేలం - కొనుగోలు చేయాలనే యోచనలో సింగరేణి - Coal Blocks Auction 2024
Use of Coal Crusher Machine : కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ సింగరేణి(Singareni Organization) సంస్థ బొగ్గు సేకరిస్తోంది. భూగర్భ గనుల్లోంచి నిత్యం టన్నుల కొద్ది బొగ్గును పైకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తడి బొగ్గు టబ్బుల్లో అతుక్కుని దాదాపు ఆరు ఇంచుల మేర అడుగున ఉండిపోయేది. అలా పేరుకుపోతూ ఉండటం వల్ల టబ్ యావరేజ్ పెంచేందుకు కార్మికులు గునపాలతో తడి బొగ్గును పెకిలించేవారు. రోజూ నలుగురు కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేసినప్పటికీ కొన్ని టబ్బులు మాత్రమే శుభ్రం చేసేవారు. ఐతే తాజాగా అందుబాటులోకి వచ్చిన యంత్రంతో పనిభారం తగ్గడంతో పాటు రోజుకు ముప్ఫై, నలభై టబ్బులు శుభ్రం చేస్తున్నారు.
సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
"బొగ్గు తీసుకువచ్చే టబ్బులో పనిచేసేందుకు ఒకప్పుడు ఆరుగురు పనిచేసేవారు. మిషన్ తయారు చేశాక ఇద్దరితో సరిపోతుంది. ఉత్పత్తి కూడా పెరిగింది. దీనివల్ల కార్మికులకు ఉత్సాహం వస్తోంది. ఇలాంటి మరిన్ని మిషన్లు సృష్టించేందుకు కృషి చేస్తాం." - లక్ష్మీనారాయణ, గని మేనేజర్
New Machine Developed Improve Coal Mining : మంచిర్యాల జిల్లా కాసిపేట-2 ఇంక్లైన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ఇంజినీర్‌ను పిలిచి టబ్ యావరేజ్ పెంచేందుకు ఏదైనా ఆలోచన చేయాలని సూచించారు. ఇంజినీర్ నందకిషోర్, ఫిట్టర్ హెల్పర్ రమేశ్ సహాయంతో బొగ్గు తొలగించే యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రం(Latest Machine in Singareni)తో గంట సమయంలో అయ్యే పని కేవలం పది నిమిషాల్లోనే చేయడంతో పాటు కార్మికులకు శారీరక శ్రమ తప్పింది. ఇటీవలే రమేశ్ ఉత్తమ కార్మికుడిగా మందమర్రి జీఎం చేతుల మీదుగా ఉత్తమ కార్మికుడిగా అవార్డు సైతం అందుకున్నారు. టబ్ క్లీనింగ్ యంత్రంతో సమయం కలిసి రావడంతో పాటు బొగ్గు ఉత్పాదకత పెరగుతుండటంతో సింగరేణిలోని మిగతా గనుల మేనేజర్లు, ఇంజినీర్లు పరిశీలించి వెళుతున్నారు.
రామగుండం నగరాభివృద్ధి పనులు - సందిగ్ధంలో వ్యాపారుల జీవితాలు - GODAVARIKHANI ROAD EXPANSION Works