ETV Bharat / state

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం - ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ మేలంటున్న నిపుణులు - New Courses Skills For Best Job - NEW COURSES SKILLS FOR BEST JOB

New Courses Skills For Best Job Opportunities : రోజులు మారుతున్నాయి, సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. దాన్ని అందిపుచ్చుకున్న వారికే అవకాశాలు మెండు. నిరుడు చాలా కంపెనీలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్ని ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకోలేదు. చాలావాటిల్లో ఉద్యోగాల కోత ఉండడమే కారణం. ప్రస్తుతం ఆయా కళాశాలల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థుల్ని మంచి ప్యాకేజీలతో ఎంపిక చేసుకుంటున్నాయి.

new_courses_skills_for_best_job_opportunities
new_courses_skills_for_best_job_opportunities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 9:29 AM IST

New Courses Skills For Best Job Opportunities : చాలా మంది విద్యార్థులు కేవలం అకడమిక్‌ పుస్తకాలు బాగా చదివి పరీక్షల్లో 80శాతానికి పైగా మార్కులు సాధిస్తే ఉద్యోగాలు వస్తాయనే భ్రమలో ఉన్నారు. అదనపు స్కిల్స్‌ నేర్చుకోవాలనే సలహా ఇచ్చే వారు లేక వెనకబడిపోతున్నారు.

బీటెక్‌ రెండో ఏడాది నుంచే సన్నద్ధత : స్కిల్స్‌ నేర్చుకోవాలంటున్నారు కదా అని బీటెక్‌ చివరి ఏడాదిలో వాటిపై దృష్టి పెట్టాలనుకోవడం కూడా తప్పే అంటున్నారు నిపుణులు. బీటెక్‌ రెండో సంవత్సరం నుంచే ఇతర కోర్సులు, విదేశీ భాషలు నేర్చుకోవడం ప్రారంభించాలని చెబుతున్నారు. అప్పుడే చివరి ఏడాదిలో జరగబోయే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు సన్నద్ధంగా ఉండొచ్చని సలహా ఇస్తున్నారు. సీ, సీప్లస్‌ప్లస్, జావా, పైథాన్‌ వంటి కోర్సులకు కాలం చెల్లిందని, వీటికి ఉద్యోగాలు రావని, ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకునే కొత్త కోర్సులు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అని కొత్తగా వచ్చింది. ఇందులో సర్వీస్‌ నౌ, పెగా, ఏడబ్ల్యూఎస్, క్లౌడ్‌ వంటి సర్టిఫికెట్‌ కోర్సులు నేర్చుకోవాలి. అప్పుడే కంపెనీల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు సాధించగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.

బీటెక్‌ చదువుతున్న సమయంలోనే సర్వీస్‌ నౌ కోర్సుపై శిక్షణ తీసుకోవాలి. స్మార్ట్‌ బ్రిడ్జి కంపెనీ వారు ఈ కోర్సుపై ప్రతిరోజూ సాయంత్రం ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారు. పూర్తయ్యాక పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఈ రెండింటిలో విద్యార్థి నైపుణ్యం సాధిస్తే అప్పుడు సర్వీస్‌ నౌ కంపెనీ ఒక ధ్రువపత్రం జారీ చేస్తుంది. అది దగ్గరుంటే ప్రాంగణ నియామకాల్లో పెద్ద కంపెనీలు సైతం వెంటనే తీసుకోవడమే కాకుండా ప్యాకేజీలు కూడా బాగానే ఇస్తాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీలను అన్ని రంగాల్లో విపరీతంగా వినియోగిస్తున్నారు. వీటికి టూల్స్‌ వాడతారు. టూల్స్‌ తెలియాలంటే ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలి. అలాగే ఆయా రంగాల్లో మార్పులు గమనిస్తుండాలి. ఆంగ్ల భాషతో పాటు ఒక విదేశీ భాష నేర్చుకోవాలి.

వేగంగా పడిపోతున్న'కోర్' ఇంజినీరింగ్‌ ప్రవేశాలు-కలవరపాటులో యాజమాన్యాలు - Engineering core branches at JNTU

గ్లోబల్‌ సర్టిఫికేషన్‌తో సిద్ధంగా ఉండాలి : మేమే ఏదైనా కంపెనీకి వెళితే వారు అడిగే మొదటి ప్రశ్న ‘మీ దగ్గర స్కిల్‌ ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎంత మంది’ అని. ఇక్కడ స్కిల్‌ అంటే కొత్తగా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ కోర్సులు నేర్చుకున్నవారు ఎంత మంది అని అడుగుతున్నారు. విద్యార్థులంతా గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ చేసుకుని సిద్ధంగా ఉండాలి. మేము ఫలానా కంపెనీకి వెళ్లి మా దగ్గర బీటెక్‌ విద్యార్థులు ఉన్నారు. వచ్చి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహిస్తారా? అని అడిగితే వచ్చే పరిస్థితి లేదిప్పుడు అని ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్​ సాంబశివరావు తెలిపారు.

అలా కాకుండా మా దగ్గర ఓ వందమంది సర్వీస్‌ నౌ గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులున్నారని చెబితే వెంటనే కంపెనీ వాళ్లు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన నైపుణ్యం ఉందా లేదా అని గమనించి కంపెనీలు తీసుకుంటున్నాయి. ఆయా కంపెనీలు ఇచ్చే ఇంటర్న్‌షిప్‌ కూడా చాలా ముఖ్యం. ఆషామాషీగా తీసుకోకుండా ఇంటిదగ్గర ఉంటూ చివరి మూడు నెలలు చేసే ఇంటర్న్‌షిప్‌ను ఆసక్తిగా చేయాలి. ఇందులో ఏమైనా తేడా వస్తే తిరస్కరిస్తాయని అన్నారు.

'ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అకడమిక్‌ మార్కులు ప్రామాణికం కాదు. ఇవి ఉద్యోగాలు సాధించిపెట్టవు. పరిశ్రమలో వస్తున్న మార్పులను గమనిస్తూ అందుకు తగ్గిన సర్టిఫికెట్‌ కోర్సులు నేర్చుకోవాలి. కనీసం మూడు అయినా అలాంటి కోర్సులు చేతిలో ఉండాలి. కోడింగ్‌లో మంచి నైపుణ్యం పెంపొందించుకోవాలి. జేఎన్‌టీయూలో విద్యార్థులకు నైపుణ్యంలో ఆరితేరేలా శిక్షణ ఇస్తున్నాం.' -కిశోర్‌బాబు జేఎన్‌టీయూ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఇన్‌ఛార్జి

చదువుతో పాటే ఉద్యోగాల వేట - ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటేలా శిక్షణ - Campus Recruitment Training

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.