Baby Kidnap In Sangareddy Govt Hospital : సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అపహరణకు గురైన శిశువు కథ సుఖాంతమైంది. కిడ్నాపైన 30 గంటల్లోనే కేసును ఛేదించి ఆ పసికందును పోలీసులు సురక్షితంగా కాపడగలిగారు. కిడ్నాపర్ల నుంచి పాపను రక్షించి సంగారెడ్డికి తీసుకువస్తున్నారు పోలీసులు. కిడ్నాపైన చిన్నారి ఆచూకిని హైదరాబాద్లో గుర్తించారు. దీంతో బిడ్డ దూరమై తల్లిడిల్లిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదీ జరిగింది : పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దుడికొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అబ్బాస్ అలీ భార్య నశిమా ఐదో కాన్పుకోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సిజేరియన్ ద్వారా ఆ గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే కొంత సేపటికే శిశువు అపహరణకు గురైంది. దీంతో ఆందోళన చెందిన ఆ పసికందు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పరిసరాల్లో ఎంత వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు. పాప కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు పాపను హైదరాబాద్లో గుర్తించారు. ఈ మేరకు ఆ ముఠా నుంచి శిశువును స్వాధీనం చేసుకుని సంగారెడ్డికి తీసుకువచ్చారు.
బురఖా వేసుకుని వచ్చి కిడ్నాప్ చేసి : మహిళ ప్రసవ సమయంలో బురఖా వేసుకుని వచ్చి ఆసుపత్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగున్న నలుగురు మహిళలే ఈ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. ఆ కిడ్నాపర్ల గ్యాంగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ నలుగురు మహిళల ముఠా వ్యవహారశైలి చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్స్లా ఉన్నారు. బురఖా వేసుకుని వచ్చి కిడ్నాప్ చేసి శిశువుతో బయటకు వెళ్లిన గ్యాంగ్ ఆ తరువాతం వేషం మార్చేసింది. కిడ్నాప్ తర్వాత నంబర్ ప్లేట్ లేని స్కూటీపై ఇద్దరు, ఆటోలో మరో ఇద్దరు మహిళలు పరారయ్యారు. పక్కా ప్రణాళికతో సినీ ఫక్కీలో శిశువుని నలుగురు మహిళల గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఈ నేరానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ రూపేశ్ పది బృందాలను కేటాయించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు పాప ఆచూకిని గుర్తించారు.
4 రోజుల పసికందును అపహరించిన మహిళ - హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తింపు
రాష్ట్రంలో మరోసారి కిడ్నాప్ కలకలం - జగిత్యాల జిల్లాలో రెండేళ్ల బాలుడి అపహరణ