New Advisors Telangana 2024 : అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులు, కష్టకాలంలో అండగా నిలిచిన నలుగురు సీనియర్ నేతలు వేం నరేందర్ రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, మల్లు రవి, షబ్బీర్ అలీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక పదవుల్లో నియమించారు. ముఖ్యమంత్రి ప్రజావ్యవహారాల సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో కలిసి పని చేశారు. 16 ఏళ్లుగా వారిద్దరి స్నేహబంధం కొనసాగుతోంది. 2004 నుంచి 2009 వరకు వేం నరేందర్‌రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా, 2007లో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టి చురుకైన నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు.
Congress leaders Wish to Advisors : 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్ రిజర్వుడ్ స్థానం కావడంతో వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా యత్నించారు. 2017లో వారిద్దరు కాంగ్రెస్‌లో( TS Govt Advisors) చేరారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత వేం నరేందర్ రెడ్డిని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వెంట నడిచిన ఆయన, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ సలహాదారుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోతుంది : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
CM Revanth Reddy Advisor : మరో సలహాదారు హర్కర్ వేణుగోపాల్ రావు ప్రొటోకాల్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి అత్యంత సన్నిహితుడు. 2018 ఎన్నికల్లో హర్కర్ వేణుగోపాల్ రావుకు టికెట్ ఇవ్వలేకపోయిన అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రొటోకాల్ ఛైర్మన్‌గా జాతీయ నాయకులు, ఇతర నాయకులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన సేవలు గుర్తించి ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా సీఎం నియమించారు. పీసీసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న మల్లు రవిని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది.
Somesh Kumar Took Charge as CM Chief Advisor : సీఎం ప్రధాన సలహాదారుడిగా సోమేశ్ బాధ్యతల స్వీకరణ
Sridhar Reddy Fire on Advisors of Telanagna CM : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ హయాంలో దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లురవి పని చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి తేవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు సకాలంలో వచ్చేలా చూడటంలో కీలక పాత్ర పోషించారు. అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సీఎం నియమించారు. వైఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ సలహాదారుగా ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) నియమించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి షబ్బీర్ అలీ ఓడిపోయారు. ఈ తరుణంలో ఆయనకు కీలక పదవిని అధిష్టానం కట్టబెట్టింది.
ఒక్క ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే.. మీకు ఇంత భయమా: శ్రీధర్ రెడ్డి
సలహాదారులుగా నియమితులైన నలుగురు ప్రభుత్వ పరిపాలనలో కీలకం కానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూల వాతావరణం తెచ్చి అన్ని అంశాలను చక్కబెట్టడంలో మల్లు రవి సమర్థంగా పని చేస్తారని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్ రావు, షబ్బీర్ అలీ ప్రభుత్వ పాలన పారదర్శకంగా కొనసాగేందుకు దోహదం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తామన్న ఆ నలుగురు, తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు - ప్రాధాన్యం లేకుండా ఎన్నాళ్లు పనిచేయాలంటూ అసహనం