ETV Bharat / state

అమ్మ బాబోయ్​..! తరగతి గదిలో పాము పుట్ట - NEST OF SNAKE IN CLASS

తరగతి గదిలో పాము పుట్ట - ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు - తుర్కపల్లిలో ఘటన

Nest Of Snake Found In Turkapally Government School
Nest Of Snake Found In Turkapally Government School (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 11:47 AM IST

Nest Of Snake Found In Turkapally Government School : మనకు ఎక్కడైనా పాము కనిపిస్తే కిలో మీటర్‌ దూరం పరిగెడతాం. కాస్తో కూస్తో ధైర్యం ఉన్నవాళ్లు అయితే దాన్ని వెళ్లగొడతారు. మరీ ధైర్యం ఉన్నవాళ్లయితే దాన్ని పట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అదే పాము పుట్ట అయితే అటువైపు కూడా వెళ్లం. గుళ్లో ఎక్కడో ఉంటే వెళ్తాం కానీ శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉంటే వెళ్తామా చెప్పండి. అటువైపు కూడా తిరిగి చూడం. అలాంటిది ఈ పాము పుట్ట ఏకంగా పాఠశాలలోనే ఉంది. పాము పక్కనే ఉంది కదానని పిల్లలకు పాఠాలు చెప్పడం లేదంటే అదీ లేదా ప్రతి రోజు స్కూల్​ టైమింగ్స్​లో శ్రద్ధగా పాఠాలు చెబుతున్నారు. మరో వింత ఏంటంటే ఆ పాఠశాల వాచ్​మెన్​​ ఆ పుట్టలో పాము బయటకు రావడం చాలాసార్లు చూశానని.. కానీ తనను ఏమీ చేయలేదని చెబుతున్నారు. ఈ విషయాలను పుట్ట ఉందని ఫిర్యాదులిచ్చే వారికి చెబుతున్నారు. ఇంతకీ ఆ పుట్ట ఉన్న పాఠశాల ఎక్కడ ఉందో తెలుసా?

కార్తిక పౌర్ణమి రోజు 2 ప్రాణాలు బలి తీసుకున్న పాము - అదీ కాటు వేయకుండానే - అదెలా అంటే?

తుర్కపల్లి గ్రామంలోని పాతబడిన పాఠశాల గదిలో పాముల పుట్ట ఉంది. ఈ శిథిలావస్థ భవనాన్ని ఎవరూ ఉపయోగించడం లేదు. దీంతో పక్క భవనంలో ఉపాధ్యాయులు తరగతులను నిర్వహిస్తున్నారు. పక్కనే పుట్ట ఉండటం పాఠశాల ప్రాంతం అంతా గడ్డి, పొదలతో నిండి, మైదాన ప్రాంతాన్ని తలపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆ పాము రోజు వస్తుంది కానీ ఏమీ చేయదు : పిల్లలు స్కూళ్లో ఆడుకునే సమయంలో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు దీనిపై పలు మార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఉపాధ్యాయులు దీన్ని పట్టించుకోవడంలేదు. ఇదిలా ఉండగా అక్కడకు పాము వస్తుందని చాలా సార్లు దాన్ని చూశానని అది తనను ఏమీ చేయదని అక్కడ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వృద్ధురాలు చెప్పడం గమనార్హం. దీనిపి ప్రభుత్వం వెంటనే స్పందించి పాత భవనాన్ని తొలగించి మైదానాన్ని చదును చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈ పాము పడగ విప్పితే మొత్తం బంగారమే! - మీరూ చూడండి

నాగుపాముపై కుక్కలు పదేపదే దాడి - ఒళ్లు గగుర్పొడిచేలా వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.