Nellore Rottela Panduga 2024 : నెల్లూరులో ఐదు రోజుల పాటు సాగే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగను వీక్షించేందుకు ముస్లీం, హిందూ అనే బేధాలు లేకుండా మతాలకు అతీతంగా భక్తులు తరలివస్తారు. ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు లక్షల్లో భక్తులు తరలివస్తారని అధికారులు తెలిపారు.
రొట్టెల పండగకు వచ్చే భక్తులకు నెల్లూరు నగరం స్వాగతం పలికింది. ఐదు రోజుల పాటు జరిగే నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ నేడు రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులు స్వర్ణాల చెరువుకు తరలి వస్తున్నారు.
కోర్కెలు నెరవేరాలా? - ఈ చెరువులో స్నానం చేస్తే సరి! - WISH FULFILLMENT SWARNALA CHERUVU
స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి : చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికల రొట్టెలు పట్టుకుని భక్తులు భుజిస్తున్నారు. బారాషహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. హిందూ - ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కిన ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ముఖ్యమైన రోజుల్లో రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో బెంగళూరు, చెన్నై, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు ముందే దర్గాకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది.
నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక : కోరిన కోరికలు నేరవేరుతాయని అందుకే ఇక్కడకు వస్తున్నట్లు భక్తులు తెలిపారు. నెల్లూరులో పుట్టి పెరిగిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూడా రొట్టెల పండుగను మర్చిపోకుండా వస్తున్నారు. ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారని భక్తులు అంటున్నారు. తాము కోరినా కోరికలు నేరవేరటానికి రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు భక్తులు వివరించారు. ఈ పండుగ తమ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అని భక్తులు చెబుతున్నారు.
Rottela Pandaga 2023: వైభవంగా నెల్లూరులో రొట్టెల పండగ.. పెరిగిన భక్తుల తాకిడి
"నెల్లూరు రొట్టెల పండుగకు 8, 9 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఈ కారణంతో ప్రతి సంవత్సరం రావాలని నిర్ణయించుకున్నాం." -భక్తులు
"మాది తెలంగాణలోని సిద్దిపేట. మొదటి సారి రొట్టెల పండుగ వచ్చాను. ఇక్కడకు వస్తే అన్ని మంచి జరుగుతాయనే నమ్మకంతో వచ్చాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి." - భక్తురాలు