ETV Bharat / state

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్‌డీఎస్‌ఏ అధ్యయనం - సీకెంట్‌ పైల్‌ పద్ధతికే మొగ్గు ఎందుకు? - NDSA Committee On Kaleshwaram

NDSA Committee On Kaleshwaram : కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్‌డీఎస్‌ఏ బృందం అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆనకట్టల డిజైన్‌లో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ వాల్‌ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది? అనే అంశాలపై దృష్టి సారించింది.

NDSA COMMITTEE ON KALESHWARAM
NDSA COMMITTEE ON KALESHWARAM
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 1:44 PM IST

NDSA Committee On Kaleshwaram : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన ఆనకట్టల డిజైన్‌లో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ వాల్‌ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది? సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) సీకెంట్‌తో పాటు ఆర్‌సీసీ డయాఫ్రం ఇచ్చినా సీకెంట్‌ పైల్స్‌ కటాఫ్‌ వైపు ప్రాజెక్టు ఇంజినీర్లు మొగ్గు చూపడానికి కారణాలేమిటన్న అంశాలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది.

NDSA on Medigadda Barrage Damage : ఇందుకు సంబంధించి గుత్తేదారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) , ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ, ప్రభుత్వం ఇలా అందరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సమావేశాల నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ కావాలని ఎన్‌డీఎస్ఏ (NDSA Committee On Barrage) నిపుణుల కమిటీ కోరింది.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఆనకట్టలకు సంబంధించిన సాంకేతిక అంశాలపై 2016 అక్టోబరు 22న జరిగిన సమావేశంలో మొదట చర్చించారు. తాము సీకెంట్‌ పైల్‌ పద్ధతిని మూడు బ్యారేజీల్లో అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు 2017 ఏప్రిల్‌ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌, సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

అయితే అన్నారం ఆనకట్ట నిర్మాణ సంస్థ ఆప్కాన్స్‌ 2017 జనవరి 16న సంబంధిత ఇంజినీర్‌కు పంపిన లేఖలో, జనవరి 9న జరిగిన నీటిపారుదల శాఖ సమావేశంలో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ వాల్‌ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించినట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఇటీవల పర్యటనలో లోతుగా చర్చించిన నిపుణుల కమిటీ, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.

మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం - అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా ఆనకట్ట పనులు - NDSA Committee On Kaleshwaram

సంబంధిత వివరాలు :

  • 2016 అక్టోబరు 22న ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పరిపాలన) ఛైర్మన్‌గా హైపవర్‌ కమిటీ భేటీ జరిగింది. ఇందులో ఈఎన్సీ జనరల్‌, సీడీఓ, కాళేశ్వరం, హైడ్రాలజీ విభాగం చీఫ్‌ ఇంజినీర్లు, హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌, కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌కు చెందిన శంభూ ఆజాద్‌ సభ్యులుగా ఉన్నారు. బోర్‌వెల్‌ డేటా, నేల స్వభావానికి సంబంధించిన పరీక్షలను పరిగణనలోకి తీసుకొని రాఫ్ట్‌, కటాఫ్‌ వాల్‌పై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు.
  • 2017 జనవరి 11న సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌, కాళేశ్వరం సీఈ(రామగుండం)కి లేఖ రాశారు. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ప్రతిపాదించిన షీట్‌ పైల్స్‌కు మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage Issue Updates)నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కన్సల్టెంట్‌లు నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ఈ పద్ధతి సరిపోదని తెలిపారు. ఇక మిగిలింది ఆర్‌సీసీ డయాఫ్రం కటాఫ్‌కు వెళ్లడం లేదా ఎల్‌అండ్‌టీ అభిప్రాయపడినట్లుగా సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ పద్ధతిని అనుసరించడం. నిర్మాణస్థలం వద్ద పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించాలని లేఖలో పేర్కొన్నారు.
  • దీంతోపాటు ఆర్‌సీసీ కట్‌ ఆఫ్‌ డయాఫ్రం, సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌లకు సంబంధించిన రెండు డ్రాయింగ్‌లను జత చేస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజినీర్ లేఖలో తెలిపారు. సబ్‌ సాయిల్‌ ఇన్వెస్టిగేషన్‌ పూర్తయిన తర్వాత బ్లాకుల వారీగా డ్రాయింగ్‌లు ఇస్తామని చెెప్పారు. తదుపరి ఏ పద్ధతి సరైనదనే దానిపై సమగ్రంగా అధ్యయనం జరగాలని అన్నారు. ఆనకట్ట వెడల్పుతో పాటు గ్రౌండ్‌ లెవల్‌ వివరాలు అందజేయాలని వివరించారు. ఏ కటాఫ్‌ వాడాలనే విషయంలో ఆర్థికపరమైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అవసరమైతే ఈ ప్రతిపాదనను ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ హైపవర్‌ కమిటీ ఎదుట ఉంచి ఆమోదం పొందాలని లేఖలో సూచించారు.
  • 2017 జనవరి 28న అన్నారం ఆనకట్ట ఆర్‌సీసీ డయాఫ్రం, సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ రెండింటికీ సీడీఓ డ్రాయింగ్‌లు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి 2017 మార్చి 29న రెండు డ్రాయింగ్‌లు ఇచ్చింది.
  • 2017 ఏప్రిల్‌ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌, సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌కు లేఖ రాశారు. నిర్మాణ స్థలంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మూడు ఆనకట్టల్లో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించామని, దీనికి డిజైన్‌లు, డ్రాయింగ్‌లు ఇవ్వాలని కోరారు.
  • అయితే 2017 జనవరి 16న అన్నారం ఆనకట్ట నిర్మాణ సంస్థ ఆప్కాన్స్‌ ప్రాజెక్టు ఇంజినీర్‌కు లేఖ రాసింది. ఇందులో జనవరి 9న నీటిపారుదలశాఖ సమావేశంలో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించినట్లు అందులో తెలిపింది. దీన్ని బట్టి జనవరిలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగినట్లు స్పష్టం అవుతోంది.

బ్యారేజీలకు ప్రమాదమని ఎప్పుడు గుర్తించారు? - గుత్తేదారులకు ఎన్‌డీఎస్‌ఏ ప్రశ్నలు - NDSA Questions on Barrage

కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం - ఆధారాలతో సహా జవాబులివ్వాలని సూచన - NDSA Committee On Kaleshwaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.