ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు- ప్రముఖుల స్పెషల్ విషెస్ - National Handloom Day celebrations - NATIONAL HANDLOOM DAY CELEBRATIONS

National Handloom Day Celebrations: రాష్ట్రంలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో చేనేత ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్న ప్రముఖులు సామాజిక మాధ్యమం ఎక్స్​ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

National_Handloom_Day_Celebrations
National_Handloom_Day_Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 4:50 PM IST

CM Chandrababu National Handloom Day Wishes: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతమైన నేత కళను ప్రపంచానికి అందించిన చేనేత కార్మికులు మన దేశ ప్రతిష్టను పెంచారన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వపరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. సమగ్ర చేనేత విధానం తీసుకువచ్చి, సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతామన్నారు.

Deputy CM Pawan Kalyan Wishes: కళాత్మక పరిశ్రమైన చేనేతకు జీవం పోయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటన్నారు. ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి ప్రాంతాలు చేనేత వస్త్రాలకు నిలయమన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో చేనేత ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు.

అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఎన్టీయే ప్రభుత్వం కచ్చితంగా చేనేతపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాల కిందటే తాను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పినట్లు గుర్తుచేశారు. ఆ క్రమంలో నేత వస్త్రాలను ధరిస్తున్నట్లు వివరించారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించి ఈ రంగంపై ఆధారపడిన వారికి ధీమా కలిగించాలని కోరారు.

జగనన్న మొండి చెయ్యి - తెగిన దారం పోగులా నేతన్నల బతుకులు - WEAVERS PROBLEMS

Minister Nara Lokesh Wishes: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరితో ముడిపడిన బంధం తనను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందన్నారు. చేనేత కళాకారుల కష్టాలు తాను చూశానని, వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ అని, పూర్తిస్థాయి అవగాహన కలిగిందని చెప్పారు. చేనేత రంగం, కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోందన్నారు.

BJP Chief Purandeshwari Wishes: సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం చేనేత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నైపుణ్యం కలిగిన కళాకారులు, కార్మికులకు ఆమె అభినందనలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. మన సాంస్కృతిక వారసత్వం, సజీవ సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని కొనిసాగిద్దామని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక హస్తకళకు మద్దతు ఇవ్వడానికి తాము అంకితభావంతో ఉన్నామన్నారు.

Union Minister Bhupathiraju Srinivasa Sharma Wishes: నేత కళను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదే అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ అన్నారు. ప్రాచీన సంప్రదాయ కళలకు ప్రతిబింబాలైన నేత కళను ప్రపంచానికి అందించిన నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Minister Savita Wishes: కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాల నిర్వహించిన వాకథాన్​లో మంత్రి సవిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్న ఆమె నేతన్న పింఛన్​ను పక్కదారి పట్టించారని ఆరోపించారు.

కష్టాల కొలిమిలో ఫణిదం చేనేత సహకారం సంఘం - ఆశలన్నీ కూటమి ప్రభుత్వం పైనే - Phanidam Handloom Industry

Minister Satyakumar Wishes: రాష్ట్రంలో చేనేత కార్మికులకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నేతన్న విగ్రహానికి పూలమాల వేసి చేనేత ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఆయన సతీమణికి చీరలు కొనుగోలు చేశారు. 110 మంది కార్మికులకు కోటి ఏడు లక్షల రూపాయల రుణాలను అందించారు. చేనేత రంగంలో రాణించిన వారిని మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్సీ అనురాధ ఘనంగా సన్మానించారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 60 వేల మందికి రుణాలు ఇచ్చి నాలుగున్నర లక్షల మందికి మేలు చేశామని గొప్పలు చెప్పుకున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని చేనేతలకు మంత్రి నారా లోకేశ్​ తన సొంత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందునే ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్సీ అనురాధ చెప్పారు. చేనేత వస్త్రాలను దరిద్దాం నేతన్నలకు అండగా నిలుద్దాం మన సాంప్రదాయాన్ని కాపాడుకుందామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.