ETV Bharat / state

డ్రగ్స్​తో దొరికితే వాళ్ల దేశానికే వెళ్లగొట్టండి - విదేశీ కేటుగాళ్లపై డిపోర్టేషన్‌ అస్త్రం - DEPORTATION ON FOREIGN DRUG DEALERS - DEPORTATION ON FOREIGN DRUG DEALERS

Deportation Against Foreign Drug Dealers : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై నార్కోటిక్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ నగరంలో వీటిని సరఫరా చేస్తున్న విదేశీయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం విదేశీ డ్రగ్స్​ సరఫరాదారులపై డిపోర్టేషన్​ అస్త్రం ప్రయోగిస్తున్నారు.

NCB Cracking Down On Drugs
NCB Cracking Down On Drugs (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 9:07 AM IST

NCB To Use Deportation on Foreign Criminals : డ్రగ్స్​ మహమ్మారిపై విరుచుకుపడుతున్న నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు వీటిని సరఫరా చేస్తున్న విదేశీయులను కట్టడి చేసేందుకు గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వారిని అరెస్టు చేస్తున్నప్పటికీ బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి సరఫరాలో మునిగి తేలుతుండటంతో మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారిపై డిపోర్టేషన్‌ (సొంత దేశానికి పంపించేయడం) అస్త్రం ప్రయోగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో పరీక్షల నిర్వహణ, కేసుల నమోదు, సాక్ష్యాల సేకరణలో కచ్చితత్వాన్ని సాధించేలా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు : రాష్ట్రంలో డ్రగ్స్​ ఊసే వినిపించకూడదని సీఎం రేవంత్‌ రెడ్డి సంబంధిత శాఖల బాధ్యులకు పదేపదే స్పష్టంచేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. వాస్తవానికి తెలంగాణలో గంజాయి సాగు లేదు. పొరుగునే ఉన్న ఏపీ నుంచి తీసుకొస్తున్నారు. కొంత సరకు ఇక్కడ వినియోగించి మిగిలినదానిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. యాఫింటమైన్‌ టైప్‌ స్టిమ్యులెంట్స్‌ (ఏటీఎస్‌)ను హైదరాబాద్‌ పరిసరాల్లోనే తయారు చేస్తున్నారు.

Supply Of Drugs From Abroad : హెరాయిన్‌, కొకైన్ వంటి ఖరీదైన మత్తుపదార్థాలను ఇతర దేశాల నుంచి అక్రమంగా డంపింగ్‌ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర విదేశీయులదే వారిలో ముఖ్యంగా నైజీరియా దేశానికి చెందిన వారిదే. ఆఫ్రికా దేశాల్లో మత్తుమందుల వాడకం సాధారణ విషయమే. చదువుల పేరిట ఇక్కడికి వస్తున్న ఆఫ్రికన్లలో కొందరు మాదక డ్రగ్స్​ వ్యాపారంలోకి దిగుతున్నారు. తమ వివరాలు తెలియకుండా ముంబయి, గోవా, బెంగళూర్లలో పాగా వేసి, హైదరాబాద్‌లో ప్రత్యేక సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయగలిగినట్లయితే పరిస్థితి చాలావరకు మెరుగవుతుంది.

విదేశీ కేటుగాళ్లపై డిపోర్టేషన్​ అస్త్రం : 2013 నుంచి ముంబయిలో ఉంటూ, వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లిపోకుండా మత్తుమందుల సరఫరా వ్యాపారంలో ఆరితేరిన చౌకౌ ఎగ్బోన్న డేవిస్‌ అలియాస్‌ టోనీని అతికష్టంమీద హైదరాబాద్‌ పోలీసులు పట్టుకోగలిగారు. ఈ నెల 15న ఒనోహ బ్లెస్సింగ్‌ అనే మహిళ నార్కొటిక్స్​ బ్యూరోకు పట్టుబడిన మహిళ 2018 నుంచి ఇదే వ్యాపారంలో ఉండటం గమనార్హం. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన 12 మంది మహిళలు, 27 మంది పురుషులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ కేసుల్లో మొత్తం 300 మంది వరకు రిమాండులో ఉండగా వారిలో 10% మంది విదేశీయులే కావడాన్ని బట్టి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జైలునుంచి వచ్చిన కొంతకాలం తర్వాత వీరు బెయిల్‌పై బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో ఈ కేసుల్లో న్యాయ విచారణ కూడా సరిగ్గా జరగడంలేదు. శిక్షలూ పడటంలేదు. అందుకే వీరిని తక్షణమే బలవంతంగా డిపోర్టేషన్‌(సొంత దేశానికి పంపించేయడం) చేయాలని భావిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో సాధ్యంకాలేదు.

అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి : వీరు డ్రగ్స్​ రవాణా చేస్తున్నట్లు బలమైన ఆధారాలను చూపించలేకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. పట్టుబడిన మత్తుమందులు, వాటిని తీసుకున్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు దర్యాప్తు అధికారులకు గతంలో సరైన శిక్షణ ఉండేది కాదు. దానికి సంబంధించిన పరికరాలు లేవు. అందుకే సాంకేతికంగా నిరూపించడమనేది సాధ్యమయ్యేది కాదు. కానీ ప్రస్తుతం సాధన సంపత్తి పెరిగింది. దాంతో నిందితుల ఆధారాలను కచ్చితంగా సేకరించి, వారిని డిపోర్టేషన్‌ చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. నెలల తరబడి వారిని జైల్లో ఉంచడం కంటే పట్టుబడిన వెంటనే తిప్పి పంపగలిగితే మత్తు మందులకు కొంతవరకైనా నియంత్రించవచ్చనేది అధికారుల ఆలోచన .

ఇన్​స్టాలో ప్రేమ - పెళ్లయ్యాక డ్రగ్స్​ దందా - అరెస్టయినా మారని వైఖరి - Five Arrested In Drug Case In Hyd

హైదరాబాద్​లో డ్రగ్స్​పై కట్టుదిట్టమైన చర్యలు - పాజిటివ్​ అని తేలితే జైలుకే - Antinarcotics Police Clarity Drugs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.