ETV Bharat / state

వైభవంగా నరసింహుడి బ్రహ్మోత్సవాలు - మహాయజ్ఞానికి ఏర్పాట్లు - Narasimha Maha yagnam Simhadri - NARASIMHA MAHA YAGNAM SIMHADRI

Narasimha Maha yagnam Conducted Simhadri Appanna Temple : రాష్ట్ర వ్యాప్తంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

narasimha_maha_yagnam_conducted_simhadri_appanna_temple

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 2:42 PM IST

వైభవంగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు- సిద్ధమవుతున్న మహాయజ్ఞం వేడుకలు

Narasimha Maha yagnam Conducted Simhadri Appanna Temple : ఈ నెల 26వ తేదీ నుంచి ఫాల్గుణ బహుళ సప్తమి ఏప్రిల్ 1 తేదీ వరకు శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ఉత్తర గోపురం ఎదురుగా ఉన్న కల్యాణోత్సవం ప్రాంగణంలో నిర్వహించే యాగానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. యాగశాల నిర్మాణం, హోమగుండాల ఏర్పాటు, భక్తులు కూర్చునేందుకు సదుపాయాలు, తాగునీరు, ఇతర వసతులు కల్పించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు.

ఉరవకొండలో నేటి నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

All Arrangements Set For Simhadri Appanna Maha yagnam : రాష్ట్ర వ్యాప్తంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామికి దివ్యకళ్యాణం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారు అమ్మవారికి కళ్యాణమాల వేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో వేణుగోపాల స్వామి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సాగిన రథోత్సవంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరునాళ్ళ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ధ్వజ స్తంభం వద్ద ఉష్ణపతాక పూజా కార్యక్రమాలు నిర్వహించి.... లక్ష్మీ నరసింహస్వామికి గజవాహన సేవతో తిరునాళ్ల వేడుకలు ఊపందుకున్నాయి. అభయమిచ్చే వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధానంలో నారసింహ మహాయజ్ఞాన్ని సింహాచలం దేవస్థానం అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయిదేళ్ల తర్వాత ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

Narasimha Brahmotsavam : ఈ మహా యజ్ఞంలో పాల్గొనే భక్తులు రూ3. వేలు చెల్లించి ప్రత్యక్ష, పరోక్ష విధానంలో పాల్గొనవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే యాగంలో భక్తులు పాల్గొంటారు. యజ్ఞంలో పాల్గొనే భక్తులకు ఉదయం అల్పాహారం సమ కూర్చుతారు. అలాగే మధ్యాహ్నం ప్రత్యేక అన్నప్రసాదం వితరణ ఉంటుంది. అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఉభయదాతలతో పాటు మరో ఇద్దరికి ఈ సదుపాయాలు అందుతాయి. పాల్గొన్న ఉభయదాతలకు శాలువ, రవిక, కల్యాణం లడ్డు, అరకిలో పులిహోర ప్రసాదం, స్వామివారి రాగి ప్రతిమ అందజేస్తారు. పరోక్ష సేవలో పాల్గొనే భక్తులకు యూట్యూబ్ ద్వారా వీక్షించే సదుపాయంతో పాటు ప్రసాదం, రాగి ప్రతిమ తపాలా ద్వారా పంపిస్తారు. సింహాచలం క్షేత్రంలో అయిదేళ్ల తర్వాత ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. లోక కల్యాణంతో పాటు భక్తుల కోర్కెలు తీరేందుకు, స్వామి అనుగ్రహం కలిగేందుకు ఆలయ వైదిక పెద్దల పర్యవేక్షణలో చతుర్వేద హపన పూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మకంగా శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టనున్నారు.

తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహనంపై విహరించిన శ్రీవారు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సర్వం సిద్ధమైన తిరుమల..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.