ETV Bharat / state

ఫ్యాన్‌ను చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చింది: నారా లోకేశ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 3:40 PM IST

Updated : Feb 19, 2024, 8:11 PM IST

Nara Lokesh Shankharavam Meeting: వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖను గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ధ్వజమెత్తారు. సామాన్యుడి చైతన్య రథంలా సైకిల్ సేవలు అందిస్తుంటే, ఐదేళ్లుగా రైతులు, యువత ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోందని విమర్శించారు. విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభల్లో లోకేశ్ పాల్గొన్నారు.

Nara_Lokesh_Shankharavam_Meeting
Nara_Lokesh_Shankharavam_Meeting

ఫ్యాన్‌ను చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చింది: నారా లోకేశ్

Nara Lokesh Shankharavam Meeting: ప్రశాంత విశాఖను వైసీపీ ప్రభుత్వం విషాదనగరంగా మార్చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వ అరాచకంతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే గంజాయి అన్నదే లేకుండా చూస్తామని ఉత్తర నియోజకవర్గ సభలో హామీ ఇచ్చారు.

జగన్ విలాసాల కోసం రుషికొండపై 500 కోట్లతో భవనాలు నిర్మించారని లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ భవనాలను ప్రజల అవసరాలకు వాడతామని గాజువాక సభలో వెల్లడించారు. అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తేస్తామని, గాజువాకలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సీఎం చేసిన మంచి పనులను చెప్పుకొంటారని రాప్తాడు సభలో జగన్ మాత్రం చంద్రబాబు పేరును 108 సార్లు స్మరించారని గుర్తుచేశారు.

సూపర్‌ 6 మ్యానిఫెస్టో చూసి జగన్‌ భయపడుతున్నారు: లోకేష్‌

అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే జగన్‌ పని అని నారా లోకేశ్ మండిపడ్డారు. గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత జగన్‌ది (YS Jagan) అని ధ్వజమెత్తారు.

రేపో, మాపో గాలిపై కూడా పన్ను వేస్తారేమో అని ఎద్దేవా చేశారు. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగనే అని ఆరోపించారు. ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలిపారు.

వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంసం - రోజుకో భూకబ్జా, కిడ్నాప్‌ : నారా లోకేశ్

టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు కనీసం ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కును సైతం అమ్మేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా చూసే బాధ్యత తనదని లోకేశ్ పేర్కొన్నారు. గంగవరం పోర్టు బాధితులను ఆదుకునే బాధ్యత తీసుకుంటానన్నారు. ఏపీఐఐసీ బాధితుల సమస్య రెండేళ్లలో పరిష్కరిస్తామని లోకేశ్ అన్నారు.

టీడీపీ, జనసేన (Janasena) మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాబు సూపర్‌ 6 తోపాటు, ఇతర గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికే నామినేటెడ్‌ పదవులు ఇస్తామని తెలిపారు.

వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంసం - రోజుకో భూకబ్జా, కిడ్నాప్‌ : నారా లోకేశ్​

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో: అంతకు ముందు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం (Shankaravam) సభలో లోకేశ్ మాట్లాడారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను వైసీపీ నేతలు విషాదనగరంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్‌ అని, నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని ధ్వజమెత్తారు. వైనాట్ 175 అంటున్న జగన్, వైనాట్ పోలవరం, వైనాట్ స్టీల్‌ప్లాంట్, వైనాట్ సంపూర్ణ మద్యపానానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని విమర్శించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని లోకేశ్ మండిపడ్డారు. ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తుందని తెలిపారు. విశాఖ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు.

5 రూపాయలు ఇస్తే పేటీఎం బ్యాచ్‌ ఏమైనా చేస్తుందని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్ చెప్పినట్లు హలో ఏపీ బైబై వైసీపీ నినాదానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అందరి పేర్లూ రెడ్‌ బుక్‌లో ఉన్నాయని లోకేశ్ హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను తాను తీసుకుంటానని లోకేశ్‌ చెప్పారు. టీడీపీ- జనసేన కార్యకర్తలు కలిసి అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు.

వైసీపీ హయాంలో రోడ్ల మరమ్మతులే చేయలేదని అనకాపల్లి శంఖారావం సభలో లోకేశ్ మండిపడ్డారు. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లబెల్లం రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు గంజాయి సరఫరా చేస్తున్న వారెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది: లోకేశ్

Last Updated : Feb 19, 2024, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.