Nara Lokesh Comments in Bheemili: రుషికొండపై 500 కోట్ల రూపాయలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్‌ను టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అంకితం చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఒక్కడి కోసం వందల కోట్ల ప్రజాధనం వెచ్చించారని మండిపడ్డారు. రుషికొండను బోడిగుండు చేసి విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో భూములు కొట్టేసి ఇక్కడి ప్రజలతో జగన్ ఆడుకున్నారని విశాఖ జిల్లా భీమిలి 'శంఖారావం' సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో జనమే జగన్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి చెల్లిస్తున్న టాక్స్‌లను తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని తెలిపారు. విశాఖతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని, మరో రెండు నెలల్లో విశాఖనే వైఎస్సార్సీపీతో ఆడుకుంటుందని అన్నారు.
జగన్‌కు అభ్యర్థులు దొరకడం లేదు- వై నాట్ పులివెందుల అనేదే మా నినాదం: చంద్రబాబు
ఇంతకు ముందు విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా ఉండేదని, ప్రస్తుతం వైఎస్సార్సీపీ పాలనలో విశాఖను గంజాయి రాజధానిగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తే తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఎదురైతే కాపాడుకోలేకపోయారని వాపోయారు. ప్రజల కష్టాలను చూసి చంద్రబాబు సూపర్ సిక్స్ రూపొందించారని, అది ఆంధ్రుల భోజనం, రాయలసీమ రాగి సంకటిలా ఉంటుందని అన్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తానని, నగరంలో అవసరమైన చోట ప్లై ఓవర్లు నిర్మిస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాని డేటా సెంటర్‌ను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో తనను భీమిలి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు వెల్లడించారు. ఎప్పుడు తెలుగుదేశం విజయం సాధించని సీటు ఏదైనా ఉందా అని అడిగి, ఆ క్రమంలోనే మంగళగిరిలో పోటీ చేసినట్లు వివరించారు.
సినిమాలోనూ రాజధాని పేరు వింటే జగన్ ఉలిక్కిపడుతున్నారు: నారా లోకేశ్
అరగంట అవంతి భీమిలి పరువు తీశాడని లోకేశ్ దుయ్యబట్టారు. అవంతి శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అన్ని పోస్టులను అమ్మేసుకున్నారని విమర్శించారు. ఒక్క భీమిలి నియోజక వర్గంలోనే 2వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేశారని ఆరోపించారు.
టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగరపు వలసలో బస్‌స్టాప్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు, రోడ్డు విస్తరణ పనులను ప్రారంబిస్తామని వివరించారు. భీమిలిలో మత్స్యకారులకు వసతి భవనం నిర్మిస్తామన్నారు. మోటార్ ఫీల్డ్ రంగంలోని వారికి మేలు చేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. మోటార్ రంగంలో దేశంలోనే తక్కువ పన్ను చెల్లించేలా రాష్ట్రంలో చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు.
'ఆ కుర్చీనట్టా మడత పెట్టి' - సీఎం జగన్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్