ETV Bharat / state

సంక్రాంతి కంటే ముందే పాఠశాలల్లో పండుగ వాతావరణం: లోకేశ్ - MINISTER NARA LOKESH AT MEGA PTM

బాపట్లలో పీటీఎం- సీఎం చంద్రబాబుతో కలసి పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

Nara_Lokesh_at_Mega_PTM
Minister Nara Lokesh at Mega PTM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 4:47 PM IST

Minister Nara Lokesh at Mega PTM: పేరెంట్స్‌-టీచర్ల సమావేశాలతో సంక్రాంతి కంటే ముందే పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొందని మంత్రి లోకేశ్ అన్నారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలసి లోకేశ్ పాల్గొన్నారు. వచ్చే ఆరు నెలల్లో డీఎస్సీని పూర్తి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులను పిడుగులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానన్నారు.

"మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు నా స్కూల్ గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా మాకు ఈ విధంగా మీటింగ్​లు ఉండేవి. అప్పట్లో మా అమ్మ స్కూల్​కి వచ్చేది. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి టీచర్. అందుకే ఆయన ఎప్పుడూ రాలేదు. బహుశా ఆయన పేరెంట్ టీచర్ మీటింగ్​కి రావడం ఇదే మొదటిసారి అనుకుంటా. పిల్లల భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దేందుకు నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చూశాము, ప్రతి కార్యక్రమంలో రాజకీయ పార్టీ రంగులు ఉండేవి. కానీ ప్రస్తుతం అవన్నీ తీసేశాము. అదే విధంగా ప్రభుత్వ ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ కూడా ప్రకటించాము. వచ్చే ఆరు నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయులను పిల్లలకు అప్పగించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది". - నారా లోకేశ్, మంత్రి

డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి : సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.