ETV Bharat / state

మంగళగిరి ఎకో పార్కును మరో కేబీఆర్‌ పార్కులా తీర్చిదిద్దుతాం: నారా బ్రాహ్మణి - nara brahmani election campaign - NARA BRAHMANI ELECTION CAMPAIGN

Nara Brahmani Election Campaign: మంగళగిరి ఎకో పార్కులో వాకర్స్‌తో నారా బ్రాహ్మణి భేటీ అయ్యారు. వాకర్స్‌కు ఉచిత ప్రవేశం కల్పించాలని నారా బ్రాహ్మణికి వినతి అందించారు. ఎకో పార్కును మరో కేబీఆర్‌ పార్కుగా తీర్చిదిద్దుతామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. ప్రకృతి వనరులతో ప్రజలకు ఆరోగ్యకర ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు.

Nara Brahmani Election Campaign
Nara Brahmani Election Campaign (etv bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 12:05 PM IST

Nara Brahmani Election Campaign: హైదరాబాదులోని కేబీఆర్‌ పార్క్ తరహాలో మంగళగిరిలోని ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎకో పార్కులో వాకర్స్​తో కలిసి వాకింగ్ చేశారు. ఎకో పార్కులో తైక్వాండో శిక్షణ పొందుతున్న పిల్లలతో ఆమె మాట్లాడారు. అనంతరం వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం నడకకు కూడా ఫీజు నిర్ణయించారని బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా ఉచితంగా వాకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని బ్రహ్మణి హామీ ఇచ్చారు. పార్కులో ఉన్న చెట్లను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాకర్స్ విన్నవించారు.

అనంతరం కృష్ణా నది సమీపంలో చేపలు పడుతున్న మత్స్యకారులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని మత్స్యకారులు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో లోకేశ్ నిత్యావసర సరుకులు పంపించి తమను ఆదుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంగళగిరి ఎకో పార్కును మరో కేబీఆర్‌ పార్కులా తీర్చిదిద్దుతాం: నారా బ్రాహ్మణి (etv bharat)

బాలకృష్ణ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన నారా బ్రాహ్మణి - Nara Brahmani election campaign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.