ETV Bharat / state

రైతులకు సాయంగా కేంద్ర ప్రభుత్వం - నమో డ్రోన్ దీదీ పథకానికి శ్రీకారం - Namo Drone Didi Distribution

Namo Drone Didi Distribution In Rangareddy : మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఎంపిక చేసి వాళ్లకు డ్రోన్‌లను ఆపరేట్ చేసేలా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం డ్రోన్‌లు ఇచ్చి గ్రామంలో వ్యవసాయంలో సహాయపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 110 మంది మహిళలకు డ్రోన్‌లు అందించారు.

Namo Drone Didi Distribution In Rangareddy
Namo Drone Didi Distribution
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 9:28 AM IST

రైతులకు సాయపడే నమో డ్రోన్ దీదీ పథకానికి కేంద్రం శ్రీకారం - స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఎంపిక

Namo Drone Didi Distribution In Rangareddy : వ్యవసాయంలో పురుగుల మందుల పిచికారి ఎంతో కీలకమైంది. పంట ఎదిగే సమయంలో చేతికొచ్చే సమయంలో చీడ పురుగుల నివారణ కోసం పలు రకాల మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన పంట పొలాల్లోకి రైతులు వెళ్లి పిచికారి చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేస్తే రైతులకు సులభంగా ఉంటుందని రసాయన, ఫర్టిలైజర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు డ్రోన్లను అందిస్తున్నారు.

Namo Drone Didi : గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించి వాళ్ల ద్వారా రైతులకు సాయపడే విధంగా కేంద్రం నమో డ్రోన్ దీదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ దీదీ (Namo Drone Didi)లను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా వేయి మందికి పైగా మహిళలకు డ్రోన్‌లను అందజేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొరమాండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 110 మంది మహిళలకు డ్రోన్లు అందించారు. డ్రోన్లు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

"డ్రోన్‌ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం కలగనుంది. డ్రోన్‌ సహయంతో మందులను పిచికారి చేయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. శ్రమ లేకుండా తేలికగా మందులు పంటకు పిచికారీ చేయవచ్చు. పైలేట్‌ శిక్షణ పది రోజులు తీసుకున్నాం. డ్రోన్‌ స్ప్రే వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. శిక్షణ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 6 లక్షలు ఖర్చుపెట్టాలంటే మా వల్ల అయ్యే పని కాదు. మా లాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. మాలో ఆత్మ విశ్వాసం పెంచింది. " - డ్రోన్‌ శిక్షణ తీసుకున్న మహిళలు

లీడ్‌ చిల్డ్రన్‌ లైబ్రరీ పేరిట గ్రంథాలయం - చదువే ఆయుధంగా విద్యార్థులకు తోడ్పడుతున్న జంట

నమో డ్రోన్ దీదీ : గ్రామాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల్లో సాంకేతికంగా పరిచయం ఉన్న వాళ్లను ఎంపిక చేశారు. కొరమాండల్ ఇంటర్‌నేషనల్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 200 మందిని ఎంపిక చేశారు. వాళ్లందరికీ డ్రోన్ నిర్వహణలో నైపుణ్య శిక్షణ ఇప్పించి డీజీసీఏ నుంచి సర్టిఫికెట్‌ అందజేశారు. ఆ తర్వాత డ్రోన్ (Drone) ఇచ్చి గ్రామంలో రైతులకు సాయపడే విధంగా రూపకల్పన చేశారు. ఒక్క రోజులో దాదాపు 30 ఎకరాల పంటకు పిచికారి చేసే విధంగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. నమో డ్రోన్ దీదీలో భాగంగా దశల వారీగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.

"గ్రామంలో స్వయం సహాయక మహిళ సంఘాల్లో సాంకేతికంగా పరిచయం ఉన్న వాళ్లను ఎంపిక చేశాం. కొరమాండల్‌ ఇంటర్‌నేషనల్‌ ఆధ్వర్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి 200 మందికి డ్రోన్‌ నిర్వాహణలో నైపు ణ్య శిక్షణ ఇప్పించి డీజీసీఏ నుంచి సర్టిఫికెట్‌ అందజేశాం. డ్రోన్‌ ఇచ్చి గ్రామంలో రైతులకు సాయపడే విధంగా రూపకల్పన చేశాం. ఒక్క రోజులో సుమారు 30 ఎకరాల పంటకు పిచికారీ చేసే విధంగా మహిళలకు శిక్షణ ఇచ్చాం."-అరుణ్ అలగప్పన్, ప్రతినిధి, కొరమాండల్ ఇంటర్‌నేషనల్ లిమిటెడ్

తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో మాయాజాలం - ప్రైవేట్ గృహానికి ప్రభుత్వ సొమ్ము!

టోల్‌ప్లాజా నిర్వహణలో జాతీయ స్థాయిలో ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానం - వరించిన బంగారు పతకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.