ETV Bharat / state

తెలంగాణ పోలీసులా మజాకా - సినిమాటిక్ స్టైల్లో పార్థీ గ్యాంగ్​ను పట్టేసుకున్నారుగా - Pardhi Gang Arrest in Hyderabad

Nalgonda CCS Police Arrested Two Thieves in Hyderabad : జాతీయ రహదారులే లక్ష్యంగా రెచ్చిపోతున్న పార్దీ గ్యాంగ్​ను సినిమాటిక్ స్టైల్​లో పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ఈ గ్యాంగ్​పై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అందులో ఇద్దరిని అరెస్టు చేశారు.

Two Members Of Pardhi Gang Arrested in Hyderabad
Two Members Of Pardhi Gang Arrested in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 11:50 AM IST

Updated : Jul 5, 2024, 2:44 PM IST

Pardhi Gang Arrested in Hyderabad : హైదరాబాద్​లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నగర శివారులోని పెద్ద అంబర్​పేట రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే జాతీర రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు తిరిగబడితే హత్యలు చేసిన ఘటనలు కూడా జరిగాయి. అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకునే పనిలో పడ్డారు.

శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వారిని వెంబడించారు. రాచకొండ పరిధిలోకి దొంగలు పారిపోగానే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి దుండగులు కత్తులతో ఎదురుదాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కడంతో వారిని అరెస్టు చేసి నల్గొండకు తరలించారు.

గత రెండు నెలల నుంచి హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై దొంగలు రెచ్చిపోతున్నారు. వాహనదారులను దోపిడీ చేస్తూ ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తున్నారు. మే నెల 18న ఏపీ నుంచి సరకును హైదరాబాద్​లో దిగుమతి చేసి తిరిగి వెళతున్న క్రమంలో అలసిపోయి వాహనాన్ని ఆపిన డ్రైవర్​ను దోపిడీ చేసే ప్రయత్నంలో కిరాతకంగా చంపారు. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్​ను దొంగలించారు. 25వ తేదీన మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో రూ.20 లక్షల విలువ చేసే ఇనుము దోచుకెళ్లారు. 28వ తేదీన నకిరేకల్ పటేల్ నగర్‌లో ఓ ఇంట్లో 8 తులాల బంగారం ఎత్తుకుపోయారు.

రాత్రయితే అంతే సంగతి : గత నెలలో ఈ నెల 3వ తేదీన అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఉన్న ఓ షోరూంలో పార్థి గ్యాంగ్ రూ.3 లక్షల 77 వేలు దోచుకెళ్లారు. ఈ నెల 9న తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సర్వీసు రోడ్డులో కారు ఆపారు. అందులో నిద్రిస్తున్న వారిపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి దాడి చేశారు. ప్రయాణికుల దగ్గర ఉన్న సుమారు 10 తులాల మేర బంగారాన్ని అపహరించారు.

జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలు ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాలను పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. తాజాగా వారిని హైదరాబాద్ శివారు ప్రాంతంలో పట్టుకున్నారు.

'ఈ దొంగ స్టైలే వేరప్పా - డబ్బు ముట్టడు - బంగారం తాకడు - మొబైల్ ఫోన్లు మాత్రం వదలడు' - Mobile thief In Yellandu

రాత్రివేళ ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్నారా? అయితే జర పైలం! - ఆదమరిచారో ఇక అంతే సంగతులు!! - Hyderabad Vijayawada Highway thefts

హైదరాబాద్ శివారు ప్రాంతాలను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా - చోరీల్లో తల్లిదండ్రులే పిల్లలకు గురువులు! - Dhar Gang Robbery in Hyderabad

Last Updated : Jul 5, 2024, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.