ETV Bharat / state

లక్డీకపూల్​లోని కలెక్టరేట్ ముందు మూసీ నిర్వాసితుల ధర్నా - ఇళ్లు కూల్చొద్దని డిమాండ్ - Moosi Victims Protest In Hyderabad

Musi Victims Protest In Hyderabad : మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్లను కూల్చే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్​లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మూసీ నిర్వాసితుల సంఘం ధర్నాకు దిగింది. మూసీని అభివృద్ధి చేస్తామంటూ పేదలమైన తమపై ప్రభుత్వం ప్రతాపం చొపొద్దంటూ నినాదాలు చేశారు. ఇళ్లు కూల్చకుండా అడ్డుకోవాలంటూ ఆందోళన చేశారు.

Musi Residents Association Protest
Musi Victims Protest In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 4:55 PM IST

Musi Residents Association Protest : మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లను కూల్చే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్టీకపూల్​లోని జిల్లా కలెక్టరేట్ ముందు మూసీ నిర్వాసితుల సంఘం ధర్నా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో తమ ఇళ్లను కూల్చి అభివృద్ధి చేస్తామనడం సరికాదన్నారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

అష్టకష్టాలు పడి డబ్బులు పెట్టి ఇండ్లను నిర్మించుకున్నామని తమ పేరుతో రిజిస్టర్​ కూడా జరగాయని వాపోయారు. చిన్నచిన్న కూలీ పనులు చేసుకుంటూ ఆటోలు, రిక్షాలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు ఉన్నాయని, కరెంట్, నల్లాబిల్లులు, ప్రాపర్టీ టాక్స్ ఇవన్నీ కడుతున్నామని ప్రభుత్వం తమకు అన్ని హక్కులు కల్పించిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా సంస్థ పేరుతో ఎఫ్​టీఎల్, బఫర్ జోన్, మూసీరివర్ బెడ్ అని చెప్పి తమ ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తమని సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పంపించడం ఎంత వరకు న్యాయమన్నారు. ఊర్లో పొలాలు అమ్ముకొని, తమ మెడలో ఉన్న బంగారం అమ్ముకొని బ్యాంకు లోను తీసుకొని ఇళ్లను కట్టుకున్నామన్నారు. ఇప్పటికీ ఆ ఇంటి అప్పు తీరక నానా కష్టాలు పడుతున్నామన్నారు. మూసీ అభివృద్ధి పేరు చెప్పి తమ ఇండ్లను తొలగిస్తే మా బతుకులు వీధిన పడే ప్రమాదం ఉందని కావున మూసీని అభివృద్ధి చేసి తమని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.

మూసీ ప్రక్షాలళన దిశగా అధికార యంత్రాంగం : మూసీ ప్రక్షాళన దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి నదీ గర్భంలో ఉన్న ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు, నిర్వాసితుల వివరాలను సేకరించారు. మరో చోట రెండు పడకగదుల ఇళ్లను కేటాయించి పరిహారం చెల్లించాకే మార్కింగ్ చేసిన ఇళ్లను తొలిగింపు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

'హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ముందే ప్రజలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఉండాల్సింది' - MLA Danam About Hydra

కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు - హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలి : హరీశ్​ రావు - brs meet HYDRA Victims

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.