ETV Bharat / state

'మా ఇళ్లు కూల్చొద్దు' మూసీ రివర్​ బెడ్​ నిర్వాసితుల డిమాండ్ - Residents Protest At MRO Office - RESIDENTS PROTEST AT MRO OFFICE

Residents Protest At MRO Office : తమ ఇళ్లు కూల్చవద్దంటూ కిషన్​బాగ్​, అసద్​బాబా నగర్, నందిముసలైగూడ వాసులు బహదూర్​పురా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం మరో చోట ఇచ్చే డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు వద్దని బాధితులు తెలిపారు. కాగా మూసీ నది రివర్​ బెడ్​లోకి అసద్​బాబా నగర్, ముసలై గూడ, కిషన్​బాగ్​ పరిధిలో దాదాపు 387 ఇళ్లు వస్తున్నాయి.

Residents Protest At MRO Office
Residents Protest At MRO Office (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 6:57 PM IST

Residents Protest At MRO Office : హైదరాబాద్​ పాతబస్తీ బహదూర్పురా నియోజకవర్గం పరిధిలోని కిషన్​ బాగ్, అసద్​ బాబానగర్, నంది ముసలైగూడ మూసీ రివర్​ బెడ్​ పరిధిలో నివసిస్తున్న ఇండ్ల వాసులు తమ ప్రాంతాల నుంచి ర్యాలీగా వచ్చి బహదూర్​పురా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమ ఇళ్లను కూల్చవద్దని డిమాండ్ చేశారు. తమకు వేరే చోట ప్రభుత్వం ఇచ్చే డబుల్​ బెడ్​రూం ఇళ్లు అవసరం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారు. వారికి మద్ధతుగా పలువురు స్థానికులు వచ్చారు.

మూసీ నది రివర్​ బెడ్​లోకి హైదరాబాద్​ బహదూర్​పురా నియోజకవర్గంలోని కిషన్​ బాగ్​ అసద్​ బాబ నగర్​, ముసలై గూడ ప్రాంతాల్లోని దాదాపు 387 ఇళ్లు వస్తున్నాయి. గురువారం రెవెన్యూ అధికారులు సర్వే చేసి మూసీ రివర్​ బెడ్​లోకి వస్తున్న ఇళ్లలో ఉన్న వారి వివరాలు సేకరించి మార్కింగ్ చేసి బాధితులకు డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

5 బృందాలుగా ఏర్పడి మార్కింగ్ : చాదర్‌ఘాట్, శంకర్‌నగర్‌లో మూసీ నది బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు అధికారులు గురువారం మార్కింగ్ చేశారు. బహదూర్‌పురా, కిషన్‌బాగ్, అసద్‌బాబా నగర్ తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేశారు. లంగర్‌హౌజ్ ఆస్రంనగర్‌లో మార్కింగ్ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో వారికి నచ్చచెప్తూ అధికారులు ముందుకుసాగారు. దీంతో స్థానికులు నిరసనకు దిగారు.

మూసీ నిర్వాసితులకు అండగ నిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు - మూడు జిల్లాల పరిధిలో రీ సర్వే - Officials Conduct Resurvey At Musi

మూసీ ప్రక్షాళన షురూ - పరీవాహక ప్రాంతాల్లో సర్వే స్టార్ట్​ - ఆ భవనాలకు మార్కింగ్ - Musi River Re Survey

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.