ETV Bharat / state

అందరినీ మురిపించేలా మూసీ! - మరి భారం పడకుండా ఎలా?

అనేక కంపెనీలు ముందుకు వస్తాయని అధికారుల అంచనా - నది పొడవునా 2వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు - మూడు ఫేజ్​లలో మూసీ ప్రాజెక్టు అభివృద్ధి

MUSI RIVER IN HYDERABAD
MUSI REJUVENATION PROJECT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 12:27 PM IST

Updated : Nov 8, 2024, 5:46 PM IST

Musi River Rejuvenation Project : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రైవేటు-పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ)లో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూసీకి ఇరువైపులా వేల కోట్ల విలువైన 2వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిలో వివిధ రకాల పర్యాటక, ప్రగతి ప్రాజెక్టులను చేపట్టడానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఒకవేళ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకుంటే వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని మూసీ ప్రాజెక్టును ప్రభుత్వమే చేపట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు ఈటీవీ భారత్​కు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు సలహా సంస్థ మూసీ ప్రాజెక్టుపై మూడు నెలల్లో తాత్కాలిక డీపీఆర్‌ను ఇవ్వనుంది. అనంతరం కొన్ని పెద్ద సంస్థలతో చర్చించాలని మున్సిపల్​ శాఖ అధికారులు భావిస్తున్నారు.

మొదటి దశలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం : మూసీ పునరుజ్జీవ పథకాన్ని ఫేజ్​-1లో నార్సింగి నుంచి బాపూఘాట్‌ వరకు 21 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్నారు. ఫేజ్​-2లో నాగోల్‌ నుంచి బాచారం వరకు ఉంటుంది. మొదటి దశ చేపట్టే ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. వాటిని తమకివ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వాటికి బదులు మరోప్రాంతంలో భూములు అప్పగిస్తామని తెలిపారు.

భూములివ్వడానికి రక్షణ అధికారులు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. మొదటి దశలో మూసీ వెంట 21 కిలోమీటర్ల పొడవున మరో వాణిజ్య నగరాన్ని నిర్మించవచ్చని అధికారులు సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తెచ్చారు. వాణిజ్య, పర్యాటక ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించారు. మూసీ, ఈసీ నదుల సంగమంగా ఉన్న బాపూఘాట్‌ వద్ద నది మధ్యలో మహాత్మా గాంధీ అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆలోచన చేస్తున్నారు.

టిప్పుఖాన్‌ వంతెన సమీపంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి తారామతి బారాదరి తరహాలో ఓ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. సాయంత్రం వేళల్లో ప్రత్యేక ఆకర్షణగా యాంఫీ థియేటర్‌ను నెలకొల్పాలన్న ప్రతిపాదన కూడా ఉంది. గోల్కొండ కోట, హిమాయత్‌సాగర్ పరిసరాల్లో మూసీని విస్తరించి టూరిజంతో ఆ ప్రాంతంలో కొత్తకళ సంతరించుకునేలా ప్రణాళికను రూపొందించారు. రాజేంద్రనగర్‌ మండలంలోని హైదర్‌నగర్, గండిపేట మండలంలోని బండ్లగూడ, బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్‌ సహా మరో మూడు గ్రామాల్లో అవసరమైతేనే భూములను సేకరించాలనే ఆలోచనలో ఉన్నారు.

సుందరీకరణ కాదు - మూసీ నది పునరుజ్జీవం : సీఎం రేవంత్‌

రెండో దశలో శిల్పారామం, ఉద్యానవనాలు : మూసీ నది ఫేజ్​-2 ప్రాజెక్టును నాగోల్‌ నుంచి తట్టిఅన్నారం నుంచి బాచారం వరకు 10 కిలోమీటర్ల పొడవున చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నదీగర్భంలో ఎలాంటి ఆక్రమణలు లేకపోవడంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టవచ్చని తేల్చారు. ఈ ప్రాంతంలో 500 ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉందని చెబుతున్నారు. పది కిలోమీటర్ల పొడవునా నదికి ఒకవైపు ఉప్పల్‌ శిల్పారామం తరహాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే వేదిక ఏర్పాటు చేయనున్నారు. రెండోవైపు మురుగుశుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) ఉన్నందున వాటికి దూరంగా ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఫేజ్​-3 కొంత కష్టమే! : బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు సుమారు 21 కిలోమీటర్ల మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కాస్త కష్టంగా ఉండే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలోనే బఫర్‌ జోన్‌లో దాదాపు 10 వేల వరకు నిర్మాణాలున్నాయి. వాటిని వెంటనే తొలగించడం కష్టసాధ్యమే. వీరందరికీ భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఇంత మొత్తాన్ని ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదు.

ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ప్రభుత్వం వేయ్యి ఎకరాల వరకు భూమిని సమీకరించబోతోంది. మలక్​పేటలోని రేస్‌ కోర్సును అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ భూములను మూసీ ప్రాజెక్టుకు ఉపయోగించుకోనుంది. ఉస్మానియా ఆసుపత్రిని తరలిస్తున్న నేపథ్యంలో అక్కడా మరో 25 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. ఇలాగే మరికొన్ని చోట్ల కూడా భూముల సేకరణ చేయనుంది.

మూసీ నది రెండు వైపులా 50 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ కింద నిర్మాణాలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని కూడా సేకరిస్తే పెద్దఎత్తున భూములు అందుబాటులోకి వస్తాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టే ప్రైవేటు సంస్థలకు ఈ భూములను కొన్నేళ్ల పాటు లీజుకు అప్పగించడం ద్వారా ఎలాంటి భారం పడబోదనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే పునరావాసానికి సంబంధించి మినహా మిగిలిన భారమంతా ప్రైవేటు సంస్థలే భరించేలా ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచిస్తున్నట్లు తెలిసింది.

హాన్ నది తరహాలో మూసీ సుందరీకరణ - అందర్నీ ఒప్పించి, మెప్పించే పునరుద్ధరణ'

దిల్లీకి మూటలు పంపేందుకు మూసీపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు : కేటీఆర్

Last Updated : Nov 8, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.