ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో మళ్లీ కుంభవృష్టి - మున్నేరు ముప్పు దృష్ట్యా అధికారులతో భట్టి సమీక్ష - DY CM Bhatti Review On Floods - DY CM BHATTI REVIEW ON FLOODS

DY CM Bhatti Review On Munneru Floods : ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఖమ్మం జిల్లాకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.

DY CM Bhatti Review On Munneru Floods
DY CM Bhatti Review On Munneru Floods (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 10:13 PM IST

Updated : Sep 7, 2024, 10:43 PM IST

DY CM Bhatti Review On Munneru Floods : ఖమ్మం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు హుటాహుటిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ కూడా ఉన్నారు. వరద ప్రమాదంపై జిల్లాలోని ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భట్టి విక్రమార్క సూచించారు.

Minister Thummala On Munneru Floods : ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సూచనలను పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది.

"వరదల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించాను. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా"- తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి

నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024

కకావికలమైన మున్నేరు ప్రభావిత ప్రాంతాలు - ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు - Rescue Operation in Khammam

Last Updated : Sep 7, 2024, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.