ETV Bharat / state

ముంబయి నటి కేసు - వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్‌ - Mumbai Actress Case Updates - MUMBAI ACTRESS CASE UPDATES

Mumbai Actress Case Updates : ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసు నిందితుడు కుక్కల విద్యాసాగర్​కు కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్​ విధించారు. విద్యాసాగర్‌ను దేహ్రాదూన్‌ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు నిందితుడికి వచ్చే నెల 4 వరకు రిమాండ్​ విధించారు.

Remand to Kukkala Vidyasagar in Actress Jethwani Case
Mumbai Actress Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 10:41 AM IST

Remand to Kukkala Vidyasagar in Actress Jethwani Case : ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు వచ్చేనెల 4 వరకు రిమాండ్‌ విధించారు. నటి కాదంబరీ జెత్వానీ కేసులో దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాలు, వ్యక్తుల ప్రమేయాన్నిఆధారంగా నిందితులుగా చేరుస్తామని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు తెలిపారు. నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను దేహ్రాదూన్‌లో అరెస్టు చేసి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై రైలులో అర్ధరాత్రి నగరానికి తీసుకొచ్చారు.

ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌ వద్దకు విద్యాసాగర్‌ను తీసుకెళ్లారు. అయితే తొలుత స్టేషన్‌ లోపలికి వెళ్లకుండా విజయవాడ వైపు వాహనాన్ని మళ్లించిన పోలీసులు, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విద్యాసాగర్‌కు వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం విద్యాసాగర్‌ను తెల్లవారుజామున జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్‌ విధించారు. విజయవాడ సబ్‌ జైలుకు నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ తరలించారు.

నేర తీవ్రత ఆధారంగా చర్యలు : విచారణలో వచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నిందితులుగా ఎవరిని చేర్చాలో నిర్ణయిస్తామని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. నిందితుల విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. తమ పరిధిలో ఉన్నంత వరకు రక్షణ కల్పిస్తామని, ఆమెకు ఉన్న ముప్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందో పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. నేర తీవ్రత ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ముంబయి నటిపై తప్పుడు కేసు - వైఎస్సార్​సీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ - Mumbai actress case Update

కాదంబరీ జెత్వానీ కేసు - నటి అరెస్టులో కీలకంగా సీఎంఓలోని ఆ ఇద్దరి పాత్ర! - Kadambari Jethwani Case Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.