Mumbai Actrees Petition on High Court in AP : సినీనటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడున్నాయో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వాటిని భద్రపరిచేందుకు తీసుకున్న చర్యల వివరాలను తెలపాలని కోరింది. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో (క్రైం నంబరు 90/2024) సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఉపకరణాలను భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
మరోవైపు విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో (PIL) తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాదంబరి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీడియా చర్చల్లో అనవసరంగా పాల్గొనకుండా ఇరుపక్షాలు నియంత్రణ పాటించాలంటూ న్యాయమూర్తి సూచించారు. కోర్టు సూచనలకు కట్టుబడి ఉంటామని న్యాయవాదులు తెలిపారు. దీంతో విచారణ ఈనెల 17కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
వైరల్ ఫొటో - హీరోయిన్‌తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue