ETV Bharat / state

నిధుల జాప్యం - ఏజెన్సీ ప్రాంతంలో నిలిచిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం - Hospital construction Stalled - HOSPITAL CONSTRUCTION STALLED

Multi Specialty Hospital Stalled Due to Funding Delays : ఏజెన్సీ వాసులకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని గత ప్రభుత్వం ఊదరగొట్టింది. తీరా చూస్తే గుత్తేదారులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడి నిలిచిపోయాయి. దీంతో కూటమి ప్రభుత్వమైనా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు.

Multi Specialty Hospital
Multi Specialty Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 12:52 PM IST

Multi Specialty Hospital Stalled Due to Funding Delays : సకల వసతులతో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని గత ప్రభుత్వం చెప్పడంతో ఏజెన్సీ వాసులు సంబరపడ్డారు. అప్పటి సీఎం జగన్‌ నిర్మాణ పనులు ప్రారంభించడంతో వైద్యానికి ఇక దూరప్రాంతాలకు వెళ్లే పనిలేదని సంతోషించారు. అయితే వారి సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. నిధుల కొరతతో ఆసుపత్రి నిర్మాణాన్ని నాటి ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో ఎన్డీయే ప్రభుత్వంపైనే ఏజెన్సీ వాసులు ఆశలు పెట్టుకున్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు : పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా, ఇందులో 5 మండలాల్లో పూర్తిగా ఏజెన్సీ వాసులే నివసిస్తున్నారు. వీరంతా సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రతిసారీ దగ్గరలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఏలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్తే తప్ప అధునాతన వైద్య సేవలు అందని పరిస్థితి. దీంతో ఏజెన్సీ ప్రాంతానికి కేంద్ర బిందువు లాంటి ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. బుట్టాయగూడెం శివారు అల్లికాలువ సమీపంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన సముదాయ నిర్మాణం ప్రారంభించింది.

వైఎస్సార్ బీమా పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది: మంత్రి వాసంశెట్టి - MINISTER ESI HOSPITAL INAUGURATION

నిధుల కొరతతో పనుల్లో జాప్యం : ఆస్పత్రి నిర్మాణానికి సుమారు రూ. 50 కోట్ల మేర నాబార్డు నిధులు మంజూరు కాగా, 2020 అక్టోబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2021 మేలో నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరినా నిధుల కొరతతో పనుల్లో తీవ్రంగా జాప్యం నెలకొంటూ వచ్చింది. ఒప్పందం ప్రకారం గతేడాది నవంబర్ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా గడువును పెంచారు. గుత్తేదారుకు బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని నెలల నుంచి పనులు నిలిపేశారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్​, చిన్న చిన్న వ్యాధులకు కూడా చనిపోకుండా కాపాడతామని గొప్పలు చెప్పింది. ఆచారణ మాత్రం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణం చేపట్టలేదు. కేవలం ఆదేశాలను మాత్రమే జారీ చేసింది. -తెల్లం రామకృష్ణ, ఏలూరు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు

విశాఖ సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం- అప్రమత్తమైన సిబ్బంది - Seven Hills Hospital Fire Accident

ఏజెన్సీ వాసులు ఆగ్రహం : మొత్తం మూడు బ్లాకులుగా భవన సముదాయం, చుట్టూ ప్రహరీ నిర్మించే విధంగా పనులు చేపట్టారు. మొదటి బ్లాక్ మాత్రమే స్లాబ్ పూర్తికాగా, రెండో బ్లాక్ నిర్మాణం పునాదుల స్థాయిలోనే ఉంది. ఇక మూడో బ్లాక్‌కు కాలమ్స్ పనుల దశలో ఆగిపోయింది. మొదటి బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓపీ, వైద్యుల విభాగాలు, మొదటి అంతస్తులో వార్డులు, ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు ఉండే విధంగా నిర్మాణం చేపట్టగా ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇంతవరకూ దాదాపు రూ.10 కోట్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా కనీసం 20 శాతం పనులు పూర్తి కాకపోవడంపై ఏజెన్సీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.