ETV Bharat / state

ఆ ఐదు యూట్యూబ్​ ఛానళ్లు రద్దు చేసిన 'మా' - అవేంటో తెలుసా? - 'ఇది ప్రారంభం మాత్రమే' - Five YouTube Channels Terminated - FIVE YOUTUBE CHANNELS TERMINATED

Movie Artists Association Terminated Five YouTube Channels : ఐదు యూట్యూబ్​ ఛానళ్లపై మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్​ చర్యలు తీసుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్​ ఛానళ్లను మూవీ అసోసియేషన్​ టెర్మినేట్​ చేసింది. ఇది ప్రారంభం మాత్రమే అంటూ యూట్యూబర్​లకు మా హెచ్చరికలు పంపింది.

movie_artists_association_terminated_five_youtube_channels
movie_artists_association_terminated_five_youtube_channels (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 5:14 PM IST

Five YouTube Channels Terminated in Telugu : సామాజిక మాధ్యమాల్లో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతు ఉదంతంపై సినీ ప్రపంచం సీరియస్​ అయిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రంగా ఖండించి, ఇలాంటి యూట్యూబ్​ ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఐదు యూట్యూబ్​ ఛానళ్లపై మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్​ చర్యలు తీసుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్​ ఛానళ్లను మూవీ అసోసియేషన్​ టెర్మినేట్​ చేసింది. ఇది ప్రారంభం మాత్రమే అంటూ యూట్యూబర్​లకు 'మా' హెచ్చరికలు పంపుతూ ఎక్స్​ వేదికగా పోస్టు చేసింది.

యూట్యూబ్​కు 'మా' లేఖ : యూట్యూబ్​కు లేఖ రాసిన 'మా' ఆ ఐదు ఛానల్​ల కంటెంట్​ సరిగ్గా లేదని, నటీనటులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటూ రద్దు చేయాలని లేఖ రాసింది. మా రాసిన లేఖపై స్పందించిన యూట్యూబ్​ యంత్రాంగం పరిశీలించి వాటిని రద్దు చేస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్​కు తెలిపింది.

'మా' రద్దు చేసిన యూట్యూబ్​ ఛానళ్లు :

  • జస్ట్​ వాచ్​ బీబీసీ
  • ట్రోల్స్​ రాజా
  • బచిన లలిత్​
  • హైదరాబాద్​ కుర్రాడు
  • ఎక్స్​వైజెడ్​ఎడిట్​జెడ్​007

మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫైర్ : నటీనటులపై అసభ్యకర, అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లకు మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్​ ఇచ్చి రెండు రోజులు కాకముందే మూవీ అసోసియేషన్​ చర్యలు తీసుకుంది. యూట్యూబర్లు నటీనటులు, వారి కుటుంబీకులపై పెట్టిన వీడియోలు, పోస్టులు 48 గంటల్లో తొలగించాలని మంచు విష్ణు హెచ్చరించారు. అలా తొలగించని పక్షంలో ఆ యూట్యాబర్లపై క్రిమినల్​ కేసులు పెట్టి ఛానల్స్​ను మూసివేస్తామని హెచ్చరికలు పంపారు.

వారం రోజుల క్రితం ఓ యూట్యూబర్​ తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వీడియోపై తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఆ యూట్యూబర్​పై చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలను ఆయన తెలిపారు. ఈ ఘటనపై మా అసోసియేషన్​కు చాలా మంది నటీనటులు లేఖలు, మెయిల్స్​ రాస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో యూట్యూబ్​లో తమ వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలో నటీనటులు, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ వీడియోలు తీస్తున్న యూట్యూబర్లకు హెచ్చరికలు పంపారు. ఇప్పుడు ఐదు యూట్యూబ్​ ఛానళ్లను బంద్​ చేస్తూ మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ నిర్ణయం తీసుకుంది. యూట్యూబర్​ ఘటనపై ముందుగా సాయిదుర్గ తేజ్​ ఆ వీడియోను తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్స్​ వేదికగా ట్యాగ్​ చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. బెంగళూరులో నిందితుడు ప్రణీత్​ హనుమంతును పట్టుకున్న పోలీసులు అతడిని హైదరాబాద్​కు తరలించారు. అనంతరం మరో ముగ్గురుని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించింది.

వారికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్​ - రెండు రోజులే టైమ్ ఇస్తున్నానంటూ!

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏకగ్రీవం- కారణం ఏంటంటే? - Manchu Vishnu Maa President

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.