Mountaineer Pulakita Hasvi Success Story : పర్వతారోహణ ప్రాణాలు సైతం పణంగా పెట్టి సాగే సాహస యాత్ర ఇది. అయితే రికార్డులు సాధించే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు మనిషిని శారీరకంగా, మానసికంగా మరింత బలవంతుల్ని చేస్తాయి. ఈ యువతి కూడా అంతే. ముందు బ్యాడ్మింటన్‌లో ఉన్నతంగా ఎదగాలనుకుంది. కానీ కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో పర్వతారోహణ వైపు మళ్లింది. అంతటితో ఆగలేదు. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలు అధిరోహించాకే తన పట్టు విడుస్తానంటోంది.
Mountaineer Pulakita Hasvi Asia Book Of Records : పర్వతారోహణ చేస్తున్న ఈ యువతి పేరు పులకిత హస్వి. స్వస్థలం మంచిర్యాల జిల్లా అయినా పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. విద్యాభ్యాసం కూడా నగరంలోనే చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఈ యువతి చిన్నప్పటి నుంచి స్కేటింగ్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ లాంటి ఆటల పట్ల ఆసక్తిగా ఉండేది. కొవిడ్ సమయంలో ఎవరెస్ట్ అనే సినిమా చూసి తాను కూడా మౌంటెనీర్ కావాలని తలచింది. చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల్లో ఆరితేరింది ఈ అమ్మాయి. అదే సమయంలో గిటార్‌లోనూ నేర్పు సాధించింది. కొవిడ్ సమయంలో తన పర్వతారోహణ ప్రయాణం గురించి, తాను అధిరోహించిన పర్వతాల గురించి, ఆ అనుభవాలు ఇలా వివరిస్తోంది.
Pulakita Hasvi Mount Kilimanjaro : బాల్యం నుంచే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చేలా హస్విని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నిత్యం వ్యాయమాలు చేస్తుండడంతో పర్వతాలు ఎక్కడం సులభంగా ఉందని అంటోంది. పర్వతారోహకులకు ఫిట్‌నెస్ ఎంతో మేలు చేస్తుందని వివరించింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతారోహణ, ఆఫ్రికాలో ఎత్తైన కిలిమాంజారో, ఆస్ట్రేలియాలో ఎత్తైన మౌంట్ కోస్కిజుకో అధిరోహించింది.
Young cloud Photographer in Hyderabad : ఫొటోలతో మేఘ సందేశం.. చూస్తే వావ్ అనాల్సిందే..!
అంతే కాకుండా మౌంట్ యూటీ కంగ్రి అధిరోహించిన పిన్న వయస్కురాలిగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇవే కాక పరుగు పందెం, సైక్లింగ్ పోటీల్లో గెలుపొంది, తనదైన మార్క్ చాటింది హస్వి. టెడ్‌ఎక్స్, జోష్ టాక్స్ కార్యక్రమాల్లో మోటివేషనల్ స్పీకర్‌గా వహించి, తెలంగాణ, హరియాణ గవర్నర్‌లతో ప్రశంసలందుకుంది.
పర్వతారోహణే కాదు చదువుల్లోనూ ఈ అమ్మాయి ముందు చురుకే. మంచి మార్కులతో సాధిస్తూ. తన వ్యాపకాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. క్రీడలు, సైక్లింగ్, పర్వతారోహణం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ యువతి భవిష్యత్తులో న్యాయవాదిగా స్థిరపడాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కృషి చేస్తానని చెబుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఎత్తైన పర్వతాలు ఎక్కేస్తూ వార్తల్లో నిలిచిన హస్వి ఈ స్థాయికి చేరుకోవడానికి కుటుంబ ప్రోత్సాహమే ముఖ్య కారణం.
పిల్లల అభిరుచులను, ఆసక్తులను గమనించి ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారని హస్వి తల్లి చెబుతోంది. హస్విని చూసిన ప్రతీసారి మనసుకు సగర్వంగా ఉంటుందని అంటోంది. ప్రతి ఒక్కరికి ఒక్కోరంగంలో ఆసక్తి ఉంటుంది. జీవితం చిన్నది. ఆసక్తి ఉన్న దానిపై దృష్టి సారించి అందులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది తన సిద్ధాంతమని చెబుతోంది యంగ్ మౌంటెనీర్ పులకిత హస్వి.
విమానం నడపడం సాహసమే అయినా సాధన చేస్తే సాధ్యమే అంటున్న యువత
సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!