ETV Bharat / state

పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో - కుమారుడిని చంపి - ఆపై తానూ ఆత్మహత్య - CHILD MURDER BY MOTHER IN YADADRI

కుమారుడికి ఊపిరాడకుండా చేసి చంపిన తల్లి - ఆపై చున్నీతో ఉరేసుకుని తానూ ఆత్మహత్య

Child Murder by Mother in Yadadri District
Child Murder by Mother in Yadadri District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 1:56 PM IST

Child Murder by Mother in Yadadri District : ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో పాపం, తన కన్నబిడ్డ ఊపిరి తీసి, తానూ ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండలం పరిధిలోని పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన జడల రాజుకు 12 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సోనితో ప్రేమ వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు కుటుంబ పోషణ కోసం పెళ్లిళ్లు, శుభకార్యాలలో డెకరేషన్ పనులు​ చేస్తుంటాడు. ఇలా వీరి కాపురం ఉన్నంతలో సాఫీగానే సాగిపోతున్న తరుణంలో ఓ అనుకోని కుదుపు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

సోమవారం సాయంత్రం రాజు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. తన తల్లిదండ్రులు చిన్నరావులపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో తన ఇద్దరి పిల్లలతో సోని ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడిని ఆడుకోమని చెప్పి బయటకు పంపించింది. చిన్న కుమారుడిని బెడ్​రూంలోకి తీసుకెళ్లి గడియ వేసుకుంది. మొదట కుమారుడికి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం చున్నీతో ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకుంది.

పని ముగించుకొని ఇంటికి చేరుకున్న భర్త, ఎంత కొట్టినా భార్య తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి పగులగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే విగత జీవులుగా కుమారుడు, భార్య కనిపించడంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూశారు. ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే వారిరువురు మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోనీ నాలుగు నెలలుగా మానసిక వేదనకు గురవుతుందని, ఆసుపత్రుల్లో సైతం చూపించామని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కోసం అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు - సహజ మరణంగా అందరినీ నమ్మించి, ఇలా దొరికిపోయారు - Man killed Father in law

జీడిమెట్లలో విషాదం - ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.