Mother Daughter Chased Thieves in Hyderabad Video : సంవత్సరం క్రితం పని కావాలని ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటికి వచ్చారు. అందుకు అంగీకరించిన యజమాని వారిని పనిలో పెట్టుకున్నాడు. వారు కొంతకాలంగా నమ్మకంగా ఉన్నట్టూ నటిస్తూ ఎక్కడెక్కడ ఏ వస్తువులూ ఉంటాయో గమనించారు. ఇంతలోనే హఠాత్తుగా పని మానేశారు. ఇక్కడే తమ ప్లాన్‌ను అమలు చేశారు. తాజాగా ఆ ఇంట్లోకే దొంగతనానికి వచ్చారు. కుటుంబ సభ్యులను గన్‌తో బెదిరించి చోరీ చేసేందుకు యత్నించారు. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
Mother Daughter Fight Robbers in Hyderabad : ఆ ఇంట్లో ఉన్న తల్లీకుమార్తెలు దొంగలను (Robbery in Telangana) ప్రతిఘటించారు. దీంతో వారు తోక ముడిచారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రసూల్‌పుర జైన్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం నవరతన్ జైన్, ఆయన భార్య అమిత మేహోత్ రసూల్‌పురలోని పైగా హౌసింగ్ కాలనీలో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్నారు.
చోరీ తర్వాత ప్రత్యేక పూజలు- కొట్టేసిన సొమ్ములో రూ.25 వేలు ఖర్చు- ఎక్కడో తెలుసా?
ఆ సమయంలో ప్రేమ్‌చంద్, సుశీల్‌కుమార్ కొరియర్ సర్వీసు వచ్చిందంటూ ఆ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. వారిని అమిత తలుపు బయటే ఉండాలని చెప్పింది. ఇంతలోనే హెల్మెట్ ధరించిన సుశీల్‌కుమార్ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించాడు బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి ఆమెపై గురి పెట్టాడు. ఈ క్రమంలోనే ప్రేమ్‌చంద్ వంటగదిలోకి వెళ్లి పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశారు.
Mother Daughter Chased Robbers in Begumpet : అదే సమయంలో అమిత సుశీల్‌ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈ క్రమంలోనే ఆమె కుమార్తె కూడా రావడంతో అతడిని గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైనా సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతను తుపాకీ వదిలి పరారయ్యాడు. ఈ లోపు తల్లీకుమార్తెల కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్‌చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.
మూడు రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన అంతర్రాష్ట నేరస్థుడు - ఎట్టకేలకు అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
దీపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే సుశీల్‌ను జీఆర్పీ పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బేగంపేట పోలీసులు తెలిపారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోందని చెప్పారు. ఏడాది క్రితం వీరిద్దరు ఇంటిపని కావాలంటూ అమిత ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. కొంతకాలం పనిచేశారని అన్నారు. ఇంట్లో ఎక్కడెక్కడ ఏయే వస్తువులు ఉంటాయో తెలుసుకుని అకస్మాత్తుగా పని మానేశారని వివరించారు. మళ్లీ గురువారం మధ్యాహ్నం వచ్చి దోపిడీకి విఫలయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.
వీరి ధైర్య సాహసాలకు పలువురు ప్రముఖుల అభినందనలు : వీరి ధైర్య సహాసాలను చూసి పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా ఉత్తరమండలం డీసీపీ రోహిణి ప్రియదర్శిని అమిత, ఆమె కుమార్తె ధైర్యసాహసాలను మెచ్చుకుని వారిని సన్మానించారు. మరోవైపు వీరు దొంగలను ఎదురుకున్న తీరుకు నెటిజన్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.
వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ కేసు.. తెలిసిన వారే నిందితులు