ETV Bharat / state

తెలియని వ్యక్తి నుంచి ఫోన్​పేలో డబ్బులు పడ్డాయా​! - వెంటనే బ్యాలెన్స్​ చెక్​ చేసుకున్నారంటే ఖాతా ఖాళీ

సైబర్​ నేరగాళ్ల కొత్త టెక్నాలజీ 'జంప్డ్' - మీరు కొంత డబ్బు అందుకున్నారంటూ ఫోన్‌లో సందేశం - దాన్ని చూసి బ్యాలెన్స్​ చెక్​ చేసుకుంటే నగదును ఊడ్చేస్తున్నారు

JUMPED TECHNIC IN CYBER CRIME
CYBER CRIME WITH PHONE PAY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Cyber Crime With Phone Pay : ఇంటర్నెట్​ బ్యాంకింగ్, జీపే, ఫోన్‌పే, పేటీఎం ఇతర థర్డ్‌పార్టీ మొబైల్‌ మనీ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సైబర్‌ మోసగాళ్లు ‘జంప్డ్‌’ అనే కొత్త టెక్నాలజీతో ప్రజలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. అందులో నేరగాళ్లు తమ నంబరును ఉపయోగించి అమాయకపు ప్రజల ఖాతాల్లో రూ.5 వేల నుంచి అంతకంటే తక్కువ జమ చేస్తారు.

ఆ తర్వాత మీ ఖాతా నగదు జమ అయ్యిందంటూ మెసేజ్​ వస్తుంది. మీరు డబ్బు అందుకున్నారంటూ ఫోన్‌లో సందేశంతో పాటు లింక్‌ పంపిస్తాడు. సాధారణంగా మనం వెంటనే నిజంగా ఖాతాలో నగదు జమ అయిందా కాలేదా? అని ఫోన్​పే ఓపెన్​ చేసి చెక్​ బ్యాలెన్స్​ పైన క్లిక్​ చేసి పిన్‌ నంబరు ఎంటర్​ చేస్తాం. అంతే ఇంకా మోసగాళ్లకు మన ఖాతాను అప్పగించినట్లే, విత్​డ్రా అభ్యర్థనను ధ్రువీకరించినట్లే అవుతుంది. ఆ తర్వాత మన ఖాతా సైబర్​ నేరగాడికి యాక్సెస్‌ అవుతుంది. ఆ మోసగాడు స్వయంగా మన ఖాతాలోని డబ్బును యజమానిలా నేరుగా విత్‌డ్రా చేసుకుంటాడు. అందుకోసమని మన ఖాతాలో గుర్తు తెలియని నంబర్ల నుంచి చిన్న మొత్తాలు జమ అయ్యాయంటే దానిని కచ్చితంగా మోసమని గ్రహించి జాగ్రత్తపడాలి.

మీకు ఇదే సమస్య ఎదురైతే ఇలా చేయండి : బ్యాలెన్స్‌ను చెక్‌ చేయడానికి ముందు మీ వాస్తవ పిన్‌ నంబరు నమోదు చేయకుండా తప్పుడు పిన్​ నంబరు ఎంటర్​ చేయండి. దీంతో అవతల నేరగాడి ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఆ తర్వాత ఖాతా నిజమైన పిన్‌ నంబరుతో బ్యాలెన్స్‌ ఎంత ఉందనేది తనిఖీ చేసుకోవాలి.

పెరుగతున్న డిజిటల్​ అరెస్టులు : ఈ మధ్య డిజిటల్​ అరెస్టుల పేరిట అధిక సంఖ్యలో ప్రజలు సైబర్​ నేరగాళ్ల మోసాలకు బలైపోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి ఓ నంబరు నుంచి కాల్​ వచ్చింది. మీ కుమారుడు డ్రగ్స్​ కలిగి ఉన్నాడు. మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే దాదాపు 20ఏళ్ల జైలుశిక్ష పడుతుందని అవతలి వ్యక్తి ఫోన్‌లో నుంచే భయబ్రాంతులకు గురి చేశాడు. వెంటనే రూ.50 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాలని, అప్పుడే మీ కుమారుడ్ని వదిలిపెడతామన్నారు.

బాధితుడు వెంటనే ఫోన్‌ కట్‌ చేసి కేరళలో చదువుకుంటున్న తన కుమారుడికి ఫోన్‌ చేశాడు. తాను క్షేమంగా కళాశాలలోనే ఉన్నానని, అలాంటి వాటికి మీరు భయపడొద్దని చెప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇలా డిజిటల్​ అరెస్టుల పేరుతో ఫోన్‌ చేసి మోసం చేయాలనుకున్నారు. కానీ అప్రమత్తమై ఫోన్‌ కట్‌చేయడంతో నిజం బయటపడింది.

'బాబాయ్​.. నా పాస్​పోర్ట్​ లాక్కున్నారు' : ఫేస్​బుక్​లో మెసేజ్​ పెట్టి లక్ష కొట్టేసిన కేటుగాళ్లు

సైబర్ కేటుగాళ్ల 'డిజిటల్ అరెస్టు' అస్త్రం - కొత్తవారు కనిపిస్తే బాధితుల్లో కలవరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.