MLC Kavitha Petition in Supreme Court : దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరగతుండగానే తనను అరెస్ట్ చేశారని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి, తనను అక్రమంగా అరెస్టు(Illegal Arrest) చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఇవాళ ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేశారు.
KTR and Harish Rao Meet Kavitha : ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు దిల్లీలోని ఈడీ కార్యాలయంలో కలిశారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్‌కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావులు ఆమెను కలిశారు.
సూర్యాస్తమయం తర్వాత కవితను అరెస్టు చేశారనడం అవాస్తవం : ఈడీ
కస్టడీలో భాగంగా తొలి రోజైన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ఈడీ(ED Arrest Kavitha) విచారించింది. విచారణ ముగిసిన అనంతరం ఆమెను కలవడానికి కుటుంబసభ్యులకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈడీ కార్యాలయం వరకు పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా వచ్చినా, వారు బయటే ఉండిపోయారు. కవితను కలిసిన తర్వాత కుటుంబీకులు ఎవరూ మీడియాతో మాట్లాడలేదు.
Kavitha Arrest in Delhi Liquor Case : న్యాయ పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలువురిని దర్యాప్తు సంస్థ విచారించనుంది. గత శుక్రవారం కవిత ఇంట్లో జరిపిన సోదాల సమయంలో 5 సెల్ ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకోగా, వాటిలో రెండు ఫోన్లు కవితవి కాగా, మిగిలినవి ఆమె వ్యక్తిగత సహాయకులు వాడుతున్నట్లు సమాచారం. వారందరితో పాటు మరికొంతమందిని సోమవారం ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మార్చి 15న దర్యాప్తు సంస్థ(Investigation Agency) ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఆమెను అరెస్ట్ చేసి, నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా దిల్లీకి తరలించారు. దిల్లీ లిక్కర్ కేసులోని ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరని, ఆమె కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ నేతలకు కవిత రూ.100 కోట్లు లంచం ఇవ్వడమే కాకుండా రూ.192.8 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం - 'అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటాం'