ETV Bharat / state

ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను బీజేపీ మోసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy Comments on BJP : ఉద్యోగాలు ఇవ్వకుండా దేశ యువతను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 2014లో చేసిన వాగ్దానాలు ఏమిటో మోదీ గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు.

MLC Jevan Reddy Fires On KCR
MLC Jeevan Reddy Comments on BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 2:53 PM IST

Updated : Mar 13, 2024, 10:36 PM IST

ఉద్యోగాలు ఇవ్వకుండా దేశ యువతను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy Comments on BJP : దేశ యువతను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని 2014లో చేసిన వాగ్దానాలు ఏమిటో మోదీ గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్​లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అని అడిగారు.

ఎలక్టోరల్‌ బాండ్లపై వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారని ఏ పార్టీకి ఎవరు చందాలు ఇస్తున్నారనేది ప్రజలకు తెలియాలని జీవన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో అమిత్‌ షా చెప్పినట్లు వ్యవస్థలు నడుస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా కూడా కిషన్‌రెడ్డిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లనే రద్దు చేస్తారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌లో లబ్ధి పొందేది ఎవరో అందరికీ తెలుసున్నారు.

జగిత్యాలలో మహిళల ద్విచక్ర వాహన ర్యాలీ - జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

MLC Jevan Reddy Fires On KCR : ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్​దే నైతిక బాధ్యతని వర్షా కాలంలో మేడిగడ్డ నీరును ఎస్సారెస్పీకి తరలించలేదని తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేక వర్షం కురవలేదన్నారు. మిషన్ భగీరథ టెక్నికల్ ఆఫీసర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 కిలో మీటర్ల నీటి ప్రవాహం తర్వాత వాటర్ ప్యూరిఫైర్ ప్రభావం ఏమీలేదని పవర్ ప్లాంట్​పై జ్యుడీషియల్ దర్యాప్తు వేయడంతో కేసీఆర్​కు భయం మొదలైందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ లేకుంటే కాళేశ్వరం లేదని మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ప్రజలకు మంచి చేయాలనే కమిట్మెంట్ ఒక వైఎస్సార్ కే ఉండేదని ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారని కొనియాడారు. ఆయన పాలన ప్రజలను మెప్పించేట్లు ఉందని కితాబిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ తుడిచిపెట్టుకుపొతుందని జోస్యం చెప్పారు. 2014ఎన్నికల మేనిఫెస్టో గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

ఎలక్ట్రోరల్ బాండ్స్ బయట పెట్టడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని జీవన్ రెడ్డి నిలదీశారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేనప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎలా తొలగిస్తారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తొలగిస్తామని తెలిపారు. భాష గురించి కేసీఆరే మాట్లాడాలని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలకు ఇన్ని రోజులు కేసీఆర్ మాట్లాడితే వినసొంపుగా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే చెవిలో సీసం పోసినట్లు ఉందా అని ప్రశ్నించారు.

'ఆ రెండింటి మధ్య నక్కకు - నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది' - కేటీఆర్​కు జీవన్​రెడ్డి కౌంటర్

రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతం : జీవన్ రెడ్డి

Last Updated : Mar 13, 2024, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.