ETV Bharat / state

ఓ వైపు వరదలు మరోవైపు గర్భిణీకి పురిటి నొప్పులు-నేనున్నానంటూ ప్రసవం చేసిన ఎమ్మెల్యే - MLA Tellam Do Delivery to Women - MLA TELLAM DO DELIVERY TO WOMEN

MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women : వైద్యో నారాయణ హరి. వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు తెలంగాణలోని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా కాన్పు చేయాల్సి రావడంతో నేనున్నాంటూ రంగంలోకి దిగి పురుడుపోసి వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారు.

MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women
MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 10:05 PM IST

MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women : ఒకవైపు పురిటి నొప్పులతో గర్భిణీలు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. మరోవైపు తమవారికి ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నేనున్నానంటూ స్టెతస్కోప్ చేతబట్టి, విజయవంతంగా ఆపరేషన్ చేసి ఇద్దరు గర్భిణీలకు కాన్పు చేశారు. ఇద్దరు పండంటి బిడ్డలకు ప్రాణం పోశాడు.

గోదావరి వరద, భారీ వర్షాలు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచెత్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. మన్యం పల్లెలకు, మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లి జనం అడుగు బయటపెట్టలేని పరిస్థితి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నిండు గర్భిణీలను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించింది.

"బదీలలపై ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది. నాకు సివిల్ సర్జన్​గా పని చేసిన అనుభవం ఉంది. అందుకే నేను వారికి ప్రసవం చేయగలిగాను. ఈ ఆస్పత్రిలో ఒక్కరే గైనాకాలజిస్ట్ ఉన్నారు. వరదల కారణంగా వారిని ఎటు తరలించే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా కాకుండా నేను ముందుగా ఒక డాక్టర్​గా స్పందించాలి. నేను వారికి ప్రసవం చేశాను." - తెల్లా వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే

భరోసా కల్పించి : ఇదే సమయంలో ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణులు, సిబ్బంది బదిలీల్లో భాగంగా వేర్వేరు చోట్లకు వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న గర్భిణీల్లో ఇద్దరికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కంగారుపడ్డారు. వేరే చోటకు తరలించాలన్నా సాధ్యం కాలేదు. స్వతహాగా శస్త్రచికిత్సల నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆస్పత్రి వర్గాలు సమాచారాన్ని చేరవేశారు. అప్పటికే వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నేనున్నాంటూ భరోసా కల్పించారు.

కాన్పు కోసం వెళ్తే.. తల్లీ, శిశువు మృతి.. హాస్పిటల్​ ఎదుట బంధువుల ఆందోళన

దుమ్ముగూడెం మండలం భీమనబోయిన స్వప్న నిండు గర్భిణీ రెండో కాన్పు నిమిత్తం సోమవారం భద్రాచలం ఆస్పత్రిలో చేరింది. మంగళవారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. ఇదే సమయంలో మరో గర్భిణీ చర్ల మండలం అంబేడ్కర్ నగర్​కు చెందిన గర్భిణీ పిల్లి పుష్పలీల కూడా రెండో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది. మరే ఇతర ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని నిమిషాల్లోనే వైద్యుడి అవతారమెత్తారు ఎమ్మెల్యే. తక్షణమే ఆపరేషన్ థియేటర్​కు తరలించమని సిబ్బందిని ఆదేశించారు. యాప్రాన్ ధరించి ఇద్దరు గర్భిణీలకు శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రసవం చేశారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈటీవీ భారత్​తో మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతవాసుల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు లేక గర్భిణీల పరిస్థితి ఏంటా అనుకుని ఆందోళన చెందుతున్న సమయంలో దేవుడు రూపంలో ఎమ్మెల్యే వచ్చి పురుడు పోశారంటూ బాలింతల కుటుంబీకులు చేతులెత్తి మొక్కారు. గర్భిణీలకు ప్రసూతి సేవలు అందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వృద్ధుడికి చికిత్స కోసం 5 కిలోమీటర్లు డోలీలోనే- స్వాతంత్ర్యం నాటి నుంచి రోడ్డు లేని గ్రామం!

నది మధ్యలో చిక్కుకుపోయిన అంబులెన్స్​.. లోపల నవజాత శిశువు, బాలింత.. ఆఖరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.