MLA Somireddy Demanded on Krishnapatnam Port : కృష్ణపట్నం పోర్టులో యథావిధిగా కంటైనర్ పునరుద్ధరించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో అదాని సిబ్బందితో సోమిరెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం కంటైనర్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కంటైనర్ పోర్టును పునరుద్ధరించాలని పోర్టు సీఈవోకు నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, కృష్ణపట్నం కంటైనర్ పోర్టును తిరిగి పునరుద్ధరించాలని కోరారు. కంటైనర్ తీసేయటం వలన ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. ఈ సంవత్సరం జనవరిలో మూతపడిన కంటైనర్ ఇప్పటివరకు తెరుచుకోలేదని మండిపడ్డారు. దీని నుంచి ప్రత్యక్షంగా 2వేల మందికి, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభిస్తోందని వెల్లడించారు.
కృష్ణపట్నం పోర్టులో ఛార్జీలు, ట్యారిఫ్‌లు కూడా పెంచి కంటైనర్ల రవాణాకు బయట పోర్టులకు వెళ్లే విధంగా ఏడాది నుంచి అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంటైనర్ టెర్మినల్‌ను తమిళనాడుకు తరలిస్తూ కృష్ణపట్నంలో మాత్రం కేవలం బొగ్గు(coal), బూడిద రవాణాకే పరిమితం చేస్తున్నారన్నారు. బొగ్గు, ఐరన్ ఓర్‌తో డర్టీ కార్గోగా పోర్టును మారిస్తే నెల్లూరు జిల్లాలో కాలుష్యం పెరుగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది: మంత్రులు - Ministers Review Meetings
దిగుమతి, ఎగుమతులతో భారీగా లాభాలు సంపాదించి పెట్టిన ఈ పోర్టును అదానీ(Adani) సొంతం చేసుకున్న తర్వాత నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నా కంటైనర్ టెర్మినల్ ఎందుకు పునరుద్ధరించటం లేదని ప్రశ్నించారు. భవిష్యత్‌లో పోర్టు నుంచి బల్క్ కార్గో ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతుందని తెలిపారు. దీనిపై గతంలో ఎన్నోసార్లు ధర్నాలు చేసిన అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు.
చాయ్ తెచ్చిన తంటా - కోడలి మెడకు చున్నీ బిగించి హత్య చేసిన అత్త
విశాఖ, చెన్నై పోర్టులో పోటీపడే ఈ పోర్టును జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు ఆదాయం తెచ్చిపెట్టే కృష్ణపట్నం పోర్టును పూర్తిగా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోర్టు నిర్మాణం కోసం అప్పట్లో రైతులు భూములను త్యాగం చేని కట్టుబట్టాలతో వెళ్లారని గుర్తుచేశారు. కంటైనర్ తిరిగి ప్రారంభించేంతవరకు పెద్ద ఎత్తున పోరాడుతామని అన్నారు. అలాగే కంటైనర్ పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ రాజీనామా - AU VC and Registrar Resigned