ETV Bharat / state

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో కీలక అప్డేట్ - టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు - MLA Lasya Nanditha Died

MLA Lasya Nanditha Road Accident Case Updates : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎమ్మెల్యే కారు ఢీకొన్న టిప్పర్‌ను గుర్తించారు. ఆ వాహనం నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

MLA Lasya Nanditha
MLA Lasya Nanditha
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 12:15 PM IST

Updated : Mar 1, 2024, 12:52 PM IST

MLA Lasya Nanditha Road Accident Case Updates : ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కారు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆమె వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ముందుగా టిప్పర్‌ను ఢీ కొని ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీ కొట్టిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ముందుగా టిప్పర్‌ కారును ఢీ కొట్టిందా, కారు టిప్పర్‌ను ఢీ కొట్టడంతోప్రమాదం జరిగిందా అనే విషయాలపై డ్రైవర్‌ను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Tipper Driver Arrested In MLA Lasya Nanditha Accident : గత నెల 23న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఓఆర్ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో కారు నడిపిన ఎమ్మెల్యే డ్రైవర్, పీఏ ఆకాశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా టిప్పర్​ను, డ్రైవర్​ను గుర్తించారు.

యువనాయకురాలు లాస్య నందిత మృతిపై ప్రముఖుల సంతాపం

అంతకుముందు లాస్య నందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. అయినా అందులో నుంచి క్షేమంగా బయటపడ్డారు. గత సంవత్సరం డిసెంబర్ 24న సికింద్రాబాద్‌ న్యూ బోయిన్​పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఇరుక్కుపోయారు. ఓవర్‌ లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకు వెళ్లిపోవడంతో అందులో చిక్కుకుపోయారు. దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగులగొట్టి లాస్య నందితను బయటకు తీసుకువచ్చారు.

BRS MLA Lasya Nanditha Car Accident : గత నెల 13న నల్గొండలో భారత్ రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగ సభకు లాస్య నందిత హాజరయ్యారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్​ వస్తుండగా మార్గమధ్యంలో నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. కానీ అదే నెల 23న జరిగిన రోడ్డు ప్రమదంలో లాస్య నందిత మరణించారు. గతేడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రి సాయన్న (MLA Sayanna) కన్నుముశారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీ కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

'లాస్య నందిత అకాల మరణం ఎంతో బాధాకరం' - సీఎం రేవంత్​ సహా ప్రముఖుల సంతాపం

అశ్రునయనాల మధ్య లాస్య నందిత అంత్యక్రియలు

Last Updated : Mar 1, 2024, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.