ETV Bharat / state

ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతున్నారా? - ఈ పొరపాట్లు చేయకపోతే విజయం మీదే! - MISTAKES TO AVOID IN EXAM PREP

ముంచుకొస్తున్న 'పరీక్షా'కాలం - ప్రణాళికతో చదివితే సులభంగానే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్న నిపుణులు

Mistakes To Avoid In Exam Preparation
Mistakes To Avoid In Exam Preparation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 7:09 PM IST

Mistakes To Avoid In Exam Preparation : కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, వార్షిక పరీక్షలైనా వాటిలో రాణించాలంటే తగిన ప్రణాళిక, సన్నద్ధత అవసరం. ముందునుంచే ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే ర్యాంకులు సాధించడం కష్టమేమి కాదని చెబుతున్నారు నిపుణులు. ప్రిపరేషన్​లో ఈ 6 పొరపాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

రాబోయేదంతా ఎగ్జామ్స్​ సీజనే. ఇప్పటికే జేఈఈ మెయిన్‌, సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలకు షెడ్యూల్స్‌ వచ్చేశాయి. అందువల్ల ఇప్పటినుంచే చక్కని ప్రణాళికతో చదివితే తప్ప మంచి స్కోరుతో రాణించడం కష్టం. తగిన ప్రణాళికను రూపొందించుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ప్రిపరేషన్‌ సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే పరీక్షల్లో విజయం సులభమేనని చెబుతున్నారు. ఇంతకీ ప్రిపరేషన్‌ టైంలో చేయకూడని మిస్టేక్స్ చూద్దామా!

వాయిదా పద్ధతి మానుకుంటే బెటర్ : ఆలస్యం అమృతం విషం అనేది పెద్దలమాట. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకోసం వెంటనే కార్యాచరణ ఆరంభించాలి. కానీ, చాలా సమయం ఉందిలే అప్పుడు మొదలుపెట్టవచ్చు ఏమవుతుందిలే? అనే నిర్లక్ష్య ధోరణితో చాలా మంది విద్యార్థులు వాయిదా పద్దతులను అనుసరిస్తుంటారు. ఇది ఎక్కువమంది సాధారణంగా చేసేటువంటి పొరపాటు. అందువల్ల, మీరు ఇప్పటినుంచే సరైన టైం టేబుల్​ను సిద్ధం చేసుకొండి. వాస్తవికతకు దగ్గరగా ఉండే లక్ష్యాలకు అనుగుణంగా ప్రిపేర్‌ అవ్వండి. మీ స్టడీ ప్లాన్‌కు కట్టుబడి ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోండి.

రివిజన్, ప్రాక్టీస్​ చేయడం మర్చిపోవద్దు : పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో రివిజన్‌, ప్రాక్టీస్‌ అనేవి అతి కీలకమైన ప్రక్రియలు. గతంలో చదివిన పాఠ్యాంశాలను తిరిగి రివిజన్ చేసుకోవడం ద్వారా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సబ్జెక్టులపై మంచి అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల, చదివిన సబ్జెక్టుల్ని రివిజన్​ చేసుకోవడం, ప్రాక్టీస్‌ చేయడాన్ని మరిచిపోవద్దు.

స్టడీ మెటీరియల్స్‌ : చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్​కు కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్​ను మొదలు పెడుతుంటారు. అందుకోసం పూర్తిగా స్టడీ మెటీరియల్స్‌పైనే ఆధారపడి ప్రిపేర్​ అవుతుంటారు. ఇది సరైన పద్దతి కాదు. మనం చదివే పుస్తకమేదైనప్పటికీ మనలో ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచడమే కాకుండా జ్ఞానాన్ని కూడా పెంచుతుంది. పలు విషయాలపై సమగ్ర అవగాహనను కల్పిస్తుంది. టెక్ట్స్​బుక్​ను చదవడంతో పాటు ఆన్‌లైన్‌లో వున్న వనరులను అన్వేషించి అధ్యయనం చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.

బట్టీ పట్టొద్దు.. కాన్సెప్ట్​ అవగాహనే ముఖ్యం : చదివే అంశాలను అవగాహన చేసుకోకుండా బట్టీ పట్టడం సాధారణంగా చాలా మంది చేసే తప్పిదం. సమాచారాన్ని కంఠస్తం చేయడం స్వల్ప కాలంలో మీకు సహాయపడొచ్చు. కానీ ఏ అంశంపైనైనా సమగ్ర అవగాహనకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు. పాఠ్యాంశంలో అంతర్లీనంగా ఉన్న భావనలను అర్థం చేసుకోవడంపై దృష్టిసారించండి. అలాంటప్పుడే మెరుగైన ర్యాంకులు సాధిస్తారు.

కొన్ని చాప్టర్లపై నిర్లక్ష్యం వద్దు : విద్యార్థులు తమ ప్రిపరేషన్‌లో కొన్ని సబ్జెక్టులు/చాప్టర్లను చదవకుండా విడిచిపెట్టి మార్కుల కోసం కొన్నింటిపైనే దృష్టిపెడతారు. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణి వల్ల చేటు తప్పదు. ప్రతి సబ్జెక్టూ పరీక్షలో అత్యంత కీలకమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా అది మీ పూర్తి స్కోరుపై ప్రభావాన్ని చూపుతుందని మరిచిపోవద్దు.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త : పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ సమయంలో కొందరు హెల్త్​ను నిర్లక్ష్యం చేస్తుంటారు. శారీరక, మానసిక దృఢత్వమనేది పరీక్షలో మీ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన వ్యాయామం చేయకపోవడం లాంటి అంశాలు మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

సీబీఎస్‌ఈ పరీక్షల్లో సత్తా చాటాలనుకుంటున్నారా? - అయితే ఈ టిప్స్‌ ప్రయత్నించండి

ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్​లో ఫస్ట్​ ర్యాంక్​ మీదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.