Mistakes in Tirupathi Final Voter List: ఓటరు జాబితాలో తప్పులను సవరించి తుది జాబితా పారదర్శకంగా విడుదల చేశామని అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఓటర్ల తుది జాబితా కూడా ముసాయిదా జాబితా తరహాలోనే తప్పుల తడకగా ఉంది. ఇందుకు తిరుపతి నియోజకవర్గమే నిదర్శనం. వైద్య సేవల కోసం సమీప ప్రాంతాల నుంచి వచ్చిన వారికీ ఓట్లు నమోదు చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు బంపరాఫర్ - రెండేసి ఓట్లు!
Irregularities In Voter List: ఓట్ల అక్రమాలపై విపక్షాల ఫిర్యాదులు, ప్రజాసంఘాల విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని ముసాయిదా జాబితాను సవరించామని అధికారులు ప్రకటించారు. కానీ తిరుపతి జిల్లా క్షేత్రస్థాయిలో పరిశీలించే కొద్దీ ఓట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 217 పోలింగ్ కేంద్ర పరిధిలోని లెప్రసీ కాలనీలో 22-8-1 చిరునామాలోని ఇంట్లో రమ్య, రవికుమార్, సురేష్ కుమార్, స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిలో స్వాతి మినహా మిగిలిన ముగ్గురికీ ఓటు హక్కు ఉంది. కానీ ఇదే చిరునామా మీద 30 మందికి ఓటు హక్కు కల్పించారు. చిరునామాను సబ్ డివిజన్లుగా మార్పు చేసి ఇంటి యజమానులకు తెలియకుండా లెప్రసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యవేడు, రాయచోటి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని జాబితాలో చేర్చారు. తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. యజమాని సమక్షంలో తెలుగుదేశం నేత సుగుణమ్మ సంబంధిత బీఎల్వోను ఫోన్ ద్వారా సంప్రదించి అక్రమ ఓట్లపై ఆరా తీశారు.
తప్పుల తడకగానే ఓటర్ల జాబితా - తిరుపతిలో ఓకే ఇంటి చిరునామాతో 32 ఓట్లు
"దొంగ ఓట్లు చూసుకునే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. తిరుపతి నియోజకవర్గం ఒక్క వీధిలోనే ఇన్ని దొంగ ఓట్లు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఓట్లు ఉంటాయి. ఎలక్షన్ కమీషన్ తగిన చర్యలు తీసుకుని దొంగ ఓట్లుపై తగిన చర్యలు తీసుకోవాలి".
-స్థానికులు
తిరుపతి నియోజకవర్గం పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. జీవకోనలోని వైసీపీ సేవాదళ్ ప్రాంతీయ సమన్వయకర్త తలారి రాజేంద్ర నివాసంలో సుమారు 38 దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 21-11-297 చిరునామాను ఏ, బీ, సీలుగా విభజించి దొంగ ఓట్లను చేర్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ముసాయిదా జాబితాలో తప్పులను సరిచేయాలని బీఎల్వోలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు జాబితాలో అవకతవకలు - ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లు