Mistakes in AP Voter list 2024 : తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల దందా కొనసాగుతోంది. ముసాయిదా జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై విపక్షాలు ఫిర్యాదు చేసినా తుది జాబితాలో మార్పులు జరగలేదు. ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార వైఎస్సార్సీపీ నేతలు అన్నివిధాలుగా అక్రమాలకు తెగబడుతున్నారు. ఒకే వ్యక్తికి 'రెండు నియోజకవర్గాల్లోనూ ఓటు కల్పిస్తున్నారు. బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను యథాతథంగా ఓటరు జాబితాలో కొనసాగించారు. పక్క పక్క నియోజకవర్గాలే కావడంతో వైఎస్సర్సీపీ నేతలు తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల పేర్లను రెండు నియోజకవర్గాల్లోనూ చేర్పిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త ఓటరు జాబితాలోనూ అదే నిర్లక్ష్యం - అవే పాత తప్పులు!
Fake Votes In Andhra Pradesh : తుది ఓటరు జాబితాలో అనేక చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కొందరి పేర్ల వద్ద ఏకంగా తమిళంలో చిరునామా పేరును చేర్చి జాబితాను విడుదల చేశారు. మరోవైపు ఫొటోలు సక్రమంగా లేకున్నా వాటిని ఓటరు జాబితాలో పొందుపర్చారు. లోకనాథం అనే వ్యక్తికి ఒకే పోలింగ్ బూతులో వివిధ చిరునామాలతో మూడు ఓట్లు నమోదు చేశారు. దేవి అనే మహిళకు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలలో ఓటు నమోదైంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాడిపేట హౌసింగ్ కాలనీలో అధిక సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. 55 బ్లాక్లో సాహో అనే వ్యక్తి లేకపోయిన ఆ పేరుతో ఓటు నమోదు చేశారు.
ఓట్ల అక్రమాలపై కొరడా ఝుళిపిస్తున్నా మారని అధికారుల తీరు - టీడీపీ నేతల మండిపాటు
Tirupati Final Voter List : తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్లపై విపక్ష నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమ యంలో అక్రమంగా డౌన్లోడ్ చేసిన 34వేల ఓట్లకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు లేఖ రాసిన స్పందన కొరవడింది. దీంతో అధికారులకు తెలిసీ ఇంకా జాబితాలో ఆయా ఓట్లను కొనసాగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తిరుపతి ఉపఎన్నిక అక్రమార్కులపై చర్యలకు రెండేళ్లు- గుంటూరులో ఓట్ల 'దొంగ'లపై ఎన్నాళ్లకో
AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నాకొద్ది ఓట్ల అక్రమాలు మరిన్ని బయటపడుతున్నాయి. తుది ఓటరు జాబితాలో సైతం దొంగ ఓట్లు గుంజడానికి ప్రయత్నాలు జరిగాయి. లేని మనుషుల పేర్లు, ఒకరి పేరుమీద నచ్చినన్ని ఓట్లు కలిగి ఉంది ఓటర్ లిస్ట్.
వేషాలు వేస్తే వేటే- రెండేళ్లనంతరం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర