- " class="align-text-top noRightClick twitterSection" data="">
Misbehavior of Youth on Traffic SI in Hyderabad : నాతో పెట్టుకుంటే అంతు చూస్తా. నేను సైకోను. నాకు ఫ్యామిలీ లేదు. నీ గురించి ఆలోచించుకో. ఇదేదో సినిమాలోని విలన్ డైలాగ్ అనుకుంటున్నారా! కానీ అస్సలు కాదు. తన బండిని ఆపారనే కోపంతో ఓ యువకుడు ట్రాఫిక్ ఎస్సైతో మాట్లాడిన మాటలు. ఈ ఘటన యూసుఫ్‌గూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని ట్రాఫిక్ పోలీసులు ఆంజనేయులు అనే యువకుడి వాహనాన్ని ఆపారు. సరైన ధ్రువపత్రాలు చూపాలంటూ యువకుడిని అడిగారు.
దీంతో ఆ యువకుడు అగ్గి మీద గుగ్గిలంలా ఎస్సైని దుర్భాషలాడాడు. సరైన ధ్రువపత్రాలు చూపించపోతే వాహనం ఆపి ప్రశ్నిస్తారా అంటూ చిందులు తొక్కాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 'నాతో పెట్టుకుంటే అంతు చూస్తా. నేను సైకో, నాకు చలానా రాస్తే నీ ఉద్యోగం ఊడగొడతా. నా బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చేస్తా. పంజాగుట్ట పీఎస్‌లో నా గురించి తెల్సుకో' అంటూ యువకుడు వీరంగం సృష్టించాడు.
దీంతో పోలీసు అధికారి కాసేపు యువకుణ్ని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అతడు బండిని అక్కడే వదిలేసి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. పోలీసు అధికారిపై దుర్భాషలాడినందుకు ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు మేరకు యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితకు గాయాలు, ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డు మృతి
రోడ్డు ప్రమాదంలో నన్ను బతికించింది హెల్మెటే : సాయి ధరమ్ తేజ్