Mirchi Farmers Problems In Hindupur : చెమటోడ్చి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గిట్టుబాటు ధరకు పంట కొనాలని కోరుకుంటున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో మిరప పంట ధరలు పతనమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండు మిర్చి ధరలు పతనమయ్యాయి. క్వింటా మిరప మార్కెట్లో 12 వేల నుంచి 14 వేల వరకు అమ్ముడుపోవాల్సి ఉండగా 7 వేల రూపాయలు కూడా దక్కడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారులు తక్కువ ధరకు అడగటంతో గిట్టుబాటు కావట్లేదంటూ పరిగి మండలానికి చెందిన ఓ రైతు పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మరికొంతమంది వ్యాపారులు అడిగిన ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Low Price to Mirchi Crop In Anantapur District : పంట సాగులో 60 శాతం కూడా రైతుకు ధర దక్కకపోవడంతో నష్టపోతున్నారు. సత్యసాయి జిల్లా పరిగి మండలానికి చెందిన రైతు బాబు మంగళవారం తన పంటను విక్రయించడానికి మార్కెట్లోకి తీసుకొచ్చారు. అక్కడ వ్యాపారులు తక్కువ ధరకు అడగడంతో అతను పంటను మార్కెట్లో విక్రయించలేక వెనక్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కొంతమంది రైతులు చేసేదేంలేక వ్యాపారులు అడిగిన ధరకు పంటను విక్రయించి నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతుకు గిటుబాటు ధర లభించే విధంగా చూడాలని, లేకుంటే మిరప రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు మిర్చియార్డుకు అవినీతి వైరస్ - Corruption in Guntur Mirchi Yard
'పంట కోసం ఖర్చు చేసిన దానిలో సగం కూడా రాలేదు. పదకొండు వందలు, ఆరు, ఏడు వందలు ఇస్తామంటున్నారు వ్యాపారులు. కనీసం ముప్పై నలభై వేలు కూడా రావడం లేదు. ఎంతో కష్టపడి పంట సాగు చేస్తే కూళ్లు, పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.' -రైతులు