Ministers Took Charge in NTR and Chandrababu Cabinet : నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ క్యాబినెట్ వర్గంలో పనిచేసిన ఇద్దరు మంత్రులు ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో ఒకరు ఎన్ఎండీ ఫరూక్ కాగా, మరొకరు ఆనం రామనారాయణరెడ్డి మంత్రులు బాధ్యతలు చేపట్టారు. 1978లో తొలుత మంత్రిగా ఎంపికైన చంద్రబాబునాయుడు అత్యంత సీనియర్ కాగా ఆయన తర్వాత ప్రస్తుత క్యాబినెట్‌లో సీనియర్లుగా ఫరూక్, ఆనం గుర్తింపు పొందారు.
కొత్తగా ఏర్పాటు అయిన క్యాబినెట్‌లో మొత్తంగా 24 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు కాగా, ఏడుగురికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర 2014-19 మధ్య మంత్రులుగా పనిచేశారు. తెలుగుదేశం జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ 2017-19 మధ్యకాలంలో మంత్రిగా పనిచేశారు. కొలుసు పార్థసారథి 2009-14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.
మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్- సామాజిక న్యాయానికి పెద్దపీట - AP New Cabinet Ministers List
మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేశారు. అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ రూపొందించారు. కొత్త క్యాబినెట్ జాబితాను పరిశీలిస్తే 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు చోటు లభించడం విశేషం. వారితో పాటు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్. సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కింది.
దుర్మార్గాలు, దమనకాండలపై పోరాడిన నాయకులు- వరించిన మంత్రి పదవులు - TDP Leaders Minister Posts
గతంలో ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయి మంత్రి వర్గంలో మొదటిసారిగా చోటు లభించింది. వారిలో పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి ఎనిమిది మంది గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి క్యాబినెట్ బెర్తుల్లో చోటు దక్కించుకున్నారు. మంత్రి అనుభవం ఉన్న మరికొందరికీ క్యాబినెట్‌లో అవకాశం దక్కింది. వారిలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్ఎమ్డీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారధి గతంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారే.